నో వే..ధోనీపై నేను ఆ కామెంట్స్ చెయ్యలేదు

ముంబయి: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీపై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా చిత్రీకరించిందని టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ మండిపడ్డాడు. సియెట్‌ క్రికెట్‌ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా అతడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో  కుల్‌దీప్‌ స్పందించాడు.

‘కారణం లేకుండా వదంతులు సృష్టించాలనుకున్న కొన్ని మీడియా సంస్థలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొందరు అనవసరంగా చేసిన రాద్దాంతంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. నాపై వచ్చిన వార్తలన్నీ అసత్యాలే.నేను ఎవరి గురించీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నాకు మహీ భాయ్‌ అంటే ఎంతో గౌరవం ఉంది’ అని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు.

సోమవారం నిర్వహించిన  సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా కుల్దీప్‌ మాట్లాడుతూ.. మహేంద్ర సింగ్‌ ధోనీపై వ్యాఖ్యలు చేశాడు. ‘చాలాసార్లు మహేంద్ర సింగ్‌ ధోనీ చిట్కాలు బెడిసికొట్టాయి. అతను ఇచ్చిన సలహాలు కూడా చాలా వరకు పని చేయలేదు. మ్యాచ్‌ సమయంలో ధోనీ ఎక్కువగా మాట్లాడడు. ఏదైనా చెప్పాలనుకుంటే ఓవర్ల మధ్యలో ఆటగాళ్లకు సూచనలు ఇస్తాడు.’ అని కుల్దీప్‌ మాట్లాడినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *