ఛాన్స్ ఇచ్చాం.. సత్తా ఏంటో నిరూపించుకోవాలి!

MSK Prasad Comments On Rohit Sharma As Test Opener, ఛాన్స్ ఇచ్చాం.. సత్తా ఏంటో నిరూపించుకోవాలి!

వన్డేల్లో ఎన్నో రికార్డులకు.. అంతకుమించి డబుల్ సెంచరీలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ఓపెనర్ రోహిత్ శర్మ. తనదైన శైలి ఆటతో విశేషంగా రాణిస్తూ.. ప్రపంచశ్రేణి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడుతున్న రోహిత్.. టెస్టుల్లో మాత్రం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా సరైన గుర్తింపు సాధించలేకపోయాడు. వన్డేలు, టీ20ల మాదిరిగానే టెస్టుల్లో కూడా రోహిత్ శర్మను ఓపెనర్‌గా పంపాలని కొందరు మాజీలు పలు సందర్భాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మను ఓపెనర్‌గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ సిరీస్‌తో రోహిత్ తన టెస్ట్ సత్తాను నిరూపించుకుంటాడని క్రీడా విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే రోహిత్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేయడంపై అసలు కారణం ఇదేనని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు.

‘లాంగ్‌ ఫార్మట్‌ క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా అంతగా రాణించని రోహిత్‌.. ఓపెనర్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకుంటాడని భావిస్తున్నాం. వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు.. ఇప్పటివరకు టెస్టుల్లో రోహిత్‌కు ఓపెనింగ్‌ అవకాశం దక్కలేదు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతడిని ఓపెనర్‌గా ఎంపిక చేశాం. విజయవంతమవుతాడని ఆశిస్తున్నాం. ఇక కేఎల్‌ రాహుల్‌ దారులు మూసుకపోలేదు. అతడు అద్భుత ప్రతిభగల ఆటగాడు. అయితే ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్నాడు. త్వరలోనే తిరిగి జట్టులోకి చేరతాడనే నమ్మకం ఉంది’అంటూ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *