లేహ్‌లో ఆర్మీ దుస్తులతో బ్యాట్ పట్టిన మహీ

MS Dhoni Plays Cricket With Kids in Leh During His Army Stint, లేహ్‌లో ఆర్మీ దుస్తులతో బ్యాట్ పట్టిన మహీ

ప్రపంచకప్ టోర్నీ అనంతరం క్రికెట్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటించిన టీం ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ..సైనిక విధుల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సైన్యంలో చేరి దాదాపు 15 రోజుల పాటు విధులు నిర్వహించాడు. ఈ సమయంలో లేహ్‌కు చేరుకున్న ధోనీ.. అక్కడి చిన్నారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. అంతేకాకుండా లడఖ్‌లో క్రికెట్‌ అకాడమీ ప్రారంభిస్తానని ధోనీ హామీ ఇచ్చినట్లు సమాచారం. బాస్కెట్‌బాల్‌ కోర్టులో బ్యాటింగ్‌ చేస్తున్న ధోనీ ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *