Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

ధోనికి బీసీసీఐ ఝలక్.. ఇక రిటైర్మెంట్ నిర్ణయమే మిగిలింది!

Dhoni Left Out In Annual Contracts, ధోనికి బీసీసీఐ ఝలక్.. ఇక రిటైర్మెంట్ నిర్ణయమే మిగిలింది!

మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్‌ ఊహాగానాలను నిజం చేస్తూ బీసీసీఐ తాజాగా ప్లేయర్స్ కాంట్రాక్ట్ లిస్టును విడుదల చేసింది. ఇప్పటివరకు గ్రేడ్ ఏ ఆటగాళ్ల లిస్ట్‌లో కొనసాగిస్తూ వస్తున్న ధోని పేరును అర్ధాంతరంగా తొలగించింది. వన్డే వరల్డ్‌కప్ ఓటమి అనంతరం ధోని జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ప్రచారం ఎక్కువైంది. ఇక తాజాగా బీసీసీఐ అక్టోబర్ 2019 నుంచి 2020 సెప్టెంబర్ వరకు 27 ప్లేయర్స్ కాంట్రాక్టును ఖరారు చేస్తూ విడుదల చేసిన లిస్ట్‌లో ధోని లేకపోవడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ లిస్ట్ 2019-20:

గ్రేడ్ ఏ+(7 కోట్లు): విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా

గ్రేడ్ ఏ(5 కోట్లు): రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, షమీ, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్‌

గ్రేడ్ బీ(3 కోట్లు): వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్

గ్రేడ్ సీ(1 కోట్లు): కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్

ఇదిలా ఉండగా డిసెంబర్ 2014న టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ఇప్పటివరకు 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఈ ఏడాది టీమిండియా ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ఆడనుంది. ఇక ఇప్పుడు ధోని పేరును యాన్యువల్ కాంట్రాక్ట్స్ నుంచి తప్పించడంతో అతడు ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్దత నెలకొంది. కాగా, ధోని నేతృత్వంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది.

Related Tags