ఐపీఎల్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ

టైగర్‌ జిందా హై..! అర్థంకాలేదా? హెలికాప్టర్‌ నాట్‌ ఔట్‌. మిస్టల్‌ కూల్‌ ఆట ఆగలేదు, ఆగదు కూడా. ఇన్ని మాటలు విన్నాక, నేను చెప్పేందేంటో మీకు అర్థం అయ్యే ఉంటుంది. మహేంద్రసింగ్‌ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్‌ కావడం లేదు. మళ్లీ వినండి. ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్‌ కావడం లేదు. అంటే ఆట మిగిలే ఉందని అర్థం...

ఐపీఎల్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ
Follow us

|

Updated on: Nov 01, 2020 | 9:59 PM

MS Dhoni has hinted : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఈ రోజు సంచలన ప్రకటన చేయనున్నాడా…? ఐపీఎల్-13 సీజన్ అబుదాబి వేదిక చివరిది కానుందా…? పంజాబ్‌తో ధోనీ ఆడుతున్న మ్యాచ్ ఐపీఎల్ చివరి ఐపీఎల్ మ్యాచ్ కానుందా…? ఐపీఎల్ నుంచి కూడా ధోనీ రిటైర్ కానున్నాదా..? ఇలాంటి పుకార్లకు ధోనీ చెక్ పెట్టారు. ఇది తన చివరి ఐపీఎల్‌ కాదనే విషయాన్ని కుండబద్దలు కొట్టాడు. ఈ ఐపీఎల్‌ తర్వాత ధోని ఇక ఆడడని రూమర్లు పుట్టుకొచ్చిన నేపథ్యంలో దానిపై ఎంఎస్డీ నుంచి స్పష్టత వచ్చింది.

హెలికాప్టర్‌ షాట్లు కొట్టే అగ్రెసివ్‌ బ్యాట్స్‌మన్‌, వికెట్ల వెనక నుంచి జట్టును కూల్‌గా నడిపించే సారథి అయిన MS ధోనీ.. వచ్చే ఏడాది కూడా ఆడతాడు. అలరిస్తాడు. తనదైన స్టయిల్‌లో ఓలలాడిస్తాడు. ఇక ఫిక్సయిపోండి. ఎందుకంటే ఈ మాట చెప్పింది స్వయంగా ధోనీనే కాబట్టి.

ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో భాగంగా టాస్‌ వేయడానికి ధోని వచ్చిన సమయంలో దీనిపై క్లారిటీ వచ్చింది. టాస్‌ వేసిన తర్వాత న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డానీ మోరిసన్‌ నుంచి ఒక ప్రశ్న దూసుకొచ్చింది. ‘ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్‌ ఇదేనా? అంటూ అడిగాడు. దానికి అంతే వేగంగా ధోని బదులిచ్చాడు. ‘కచ్చితంగా కాదు’ అంటూ ధోని సమాధానం చెప్పడంతో ధోనీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

రూమర్లకు బ్రేక్‌ పడిందని ధోనీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వచ్చే ఐపీఎల్‌ కూడా తాను ఆడతాననే సంకేతాలిచ్చాడు ధోని. అంతే కాకుండా ట్వీటర్‌లో ధోని సమాధానానికి ఫ్యాన్స్ నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ధోని రిప్లై అదిరిందని సీఎస్‌కే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ధోనీ అంటేనే ఇలాంటి దూకుడు. ధోనీ అంటేనే ఫిరంగులు పేల్చినట్లు షాట్ల వస్తాయి. 2005లో 145 బంతుల్లో 183 పరుగులు చేసిన ధోనీ ఇన్నింగ్స్‌ను- ఫ్యాన్స్‌ ఎప్పటికీ మరచిపోలేరు. మళ్లీ అలాంటి ఇన్నింగ్స్‌ రావాలని ఫ్యాన్స్‌ కోలుకుంటున్నారు.

ఈ సీజన్‌లో లీగ్‌ దశ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా సీఎస్‌కే నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరకుండా ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి. దాంతో ధోనిపై విమర్శలు గుప్పుమన్నాయి. అదే సమయంలో ధోని ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనికి ధోని ఇచ్చిన సమాధానంతో ఎండ్ కార్డు పడింది.