ధోనీపై కోహ్లీ ప్రశంసల వర్షం

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో టీం ఇండియాకు ఎంఎస్ ధోనీ సేవలు ఏంతో అవసరమని కోహ్లీ తెలిపాడు. జట్టులో క్రికెటర్లందరూ బాగా రాణించాలంటే ధోనీ సూచనలు అవసరమని, భారత్ విజయాలకు ధోని సలహాలు అవసరమని కోహ్లీ అన్నారు. ప్రపంచ కప్‌లో తొలిసారిగా భారత జట్టుకు కోహ్లీ సారథ్యం వహించనున్నాడు. మరో క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ను కూడా కోహ్లీ కొనియాడాడు. దినేశ్ అద్భుతంగా రాణిస్తాడని, చాలాసార్లు మ్యాచ్‌ను గట్టెక్కించాడని కోహ్లీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *