ధోనీ ర‌నౌట్‌ చూశారా..?.. అంపైర్ నిర్ణ‌యం కరెక్టేనా.. ?

ఆదివారం ఉప్ప‌ల్ స్టేడియంలో థ్రిల్లింగ్‌గా సాగిన ఐపీఎల్ ఫైన‌ల్లో.. ముంబై ఇండియ‌న్స్ విక్ట‌రీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే చెన్నై కెప్టెన్ ధోనీ ర‌నౌట్ అయిన తీరు వివాదాస్ప‌ద‌మైంది. కేవ‌లం రెండు ర‌న్స్ తేడాతోనే చెన్నై ఓట‌మిపాలైంది. కానీ ధోనీ ఔటైన తీరు మ్యాచ్ లో కీలకమయ్యింది. ఆ రనౌటే మ్యాచ్‌ను మార్చేసిన‌ట్లు క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. వాట్సాన్ కొట్టిన షాట్‌కు మొద‌ట ఒక ప‌రుగు తీశారు. అయితే ఓవ‌ర్‌త్రో కావ‌డంతో రెండో ర‌న్‌ కోసం ధోనీ […]

ధోనీ ర‌నౌట్‌ చూశారా..?.. అంపైర్ నిర్ణ‌యం కరెక్టేనా.. ?
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 1:12 PM

ఆదివారం ఉప్ప‌ల్ స్టేడియంలో థ్రిల్లింగ్‌గా సాగిన ఐపీఎల్ ఫైన‌ల్లో.. ముంబై ఇండియ‌న్స్ విక్ట‌రీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే చెన్నై కెప్టెన్ ధోనీ ర‌నౌట్ అయిన తీరు వివాదాస్ప‌ద‌మైంది. కేవ‌లం రెండు ర‌న్స్ తేడాతోనే చెన్నై ఓట‌మిపాలైంది. కానీ ధోనీ ఔటైన తీరు మ్యాచ్ లో కీలకమయ్యింది. ఆ రనౌటే మ్యాచ్‌ను మార్చేసిన‌ట్లు క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.

వాట్సాన్ కొట్టిన షాట్‌కు మొద‌ట ఒక ప‌రుగు తీశారు. అయితే ఓవ‌ర్‌త్రో కావ‌డంతో రెండో ర‌న్‌ కోసం ధోనీ ప‌రుగు తీశాడు. అప్పుడు మిడాఫ్‌లో ఉన్న ఇశాన్ కిష‌న్ వేసిన త్రో నేరుగా వికెట్స్‌ను త‌గిలింది. ఫీల్డ్ అంపైర్ ర‌నౌట్‌పై థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. దీంతో ధోనీ రనౌట్ కు సంబంధించి టీవీ స్క్రీన్ల‌పై రిప్లేలు మొద‌ల‌య్యాయి. మూడ‌వ అంపైర్ నీగ‌ల్ లాంగ్ ర‌నౌట్‌పై నిర్ణ‌యం తీసుకునేందుకు చాలా స‌మ‌య‌మే తీసుకున్నాడు. చాలా కోణాల్లో ఆ ర‌నౌట్‌ను ప‌రిశీలించాల్సి వ‌చ్చింది. మ‌రో వైపు టీవీ కామెంటేట‌ర్లు త‌మ అనుభ‌వాల‌ను చెబుతూ వచ్చారు. కామెంటేట‌ర్ గా వ్యవహరిస్తున్న సంజ‌య్ మంజ్రేక‌ర్ ఒక కోణంలో రిప్లేను చూసి ధోనీని ఔట్ ఇవ్వాల్సిందే అన్నాడు. కాగా, మ‌రికొంత మంది కామెంటేట‌ర్లు మాత్రం.. బ్యామ్స్‌మెన్‌కు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలంటూ అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ చివ‌ర‌కు థర్డ్ అంపైర్‌.. ధోనీని ఔట్‌గా డిక్లేర్ చేశాడు. దీంతో ముంబై సంబ‌రాల్లో తేలింది. ఈ సంఘ‌ట‌న 13 ఓవ‌ర్‌లో చోటుచేసుకున్న‌ది. అయితే ఈ ఔట్ పై నెటిజ‌న్లు మాత్రం వెరైటీ ట్వీట్ల‌తో చెల‌రేగిపోతున్నారు.