Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మ్యాచ్‌తోనే ధోని రీ-ఎంట్రీ.!

MS Dhoni Cricket Re Entry With IPL 2020 Chairty Match, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మ్యాచ్‌తోనే ధోని రీ-ఎంట్రీ.!

MS Dhoni Cricket Re Entry With IPL 2020 Chairty Match: పొట్టి క్రికెట్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. ఈ మేరకు మ్యాచ్‌ల టైమింగ్స్‌లో ఎటువంటి మార్పులు లేవని పేర్కొంటూ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. అంతేకాక ఫైనల్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతుందని కూడా వెల్లడించింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఓ ఛారిటీ మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. సరిగ్గా టోర్నమెంట్ ప్రారంభం కానున్న మూడు రోజులకు ముందు ఈ మ్యాచ్ జరగనుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నార్త్, ఈస్ట్(ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌) ఫ్రాంచైజీలు ఒక జట్టు గానూ.. సౌత్, వెస్ట్(చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్) ఫ్రాంచైజీలు మరో జట్టుగా కలిసి ఆడనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ కాన్సెప్ట్ రూపకర్తలు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్‌లని సమాచారం.

ఒకే టీమ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎం‌ఎస్ ధోని, డివిలియర్స్…

ఇక ఈ ఛారిటీ మ్యాచ్‌.. వెస్ట్, సౌత్ ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, డివిలియర్స్, షేన్ వాట్సన్, బుమ్రా, మలింగా వంటి స్టార్ ప్లేయర్లు ఒకే టీమ్ తరపున ఆడనున్నారు. అంతేకాక నార్త్ అండ్ ఈస్ట్ ఫ్రాంచైజీల ఫ్యాన్స్.. రస్సల్, పంత్, స్టోక్స్, బట్లర్, శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్, మోర్గాన్, స్టీవ్ స్మిత్, ఆర్చర్ వంటి ఆటగాళ్లను సేమ్ టీమ్‌లో చూడవచ్చు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట గుజరాత్‌లో కొత్తగా నిర్మితమైన అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందని సమాచారం. అంతేకాకుండా తలా ధోని ఈ మ్యాచ్‌తో క్రికెట్‌కు రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ గయ్స్…

Related Tags