Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

Hidden Treasures : గుప్త నిధుల ఆశ..గుడిలో ఎంపీటీసీ తవ్వకాలు..చివరకు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ​జిల్లా పెంచికల్ పేట్ మండలం పోతేపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి.
Illegal Excavations For Hidden Treasures in komaram bheem asifabad, Hidden Treasures : గుప్త నిధుల ఆశ..గుడిలో ఎంపీటీసీ తవ్వకాలు..చివరకు

Hidden Treasures : కుమ్రం భీం ఆసిఫాబాద్ ​జిల్లా పెంచికల్ పేట్ మండలం పోతేపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో 8 మంది సభ్యులు గల ముఠా గుడిలో తవ్వకాలు జరపడం స్థానికుల కంటపడింది. దీంతో వారు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఎంతసేపటికి రాకపోవడంతో..గ్రామస్థులే వెళ్లి ఆ గ్యాంగ్‌ను తాళ్లతో బంధించారు.

మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు స్థానిక ఎస్సై అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులను..స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయితే ఈ గ్యాంగ్‌లో కాగజ్‌నగర్ మండలంలోని రామ్‌నగర్‌కి చెందిన ఎంపీటీసీ బికాస్ ఘరామి ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. అతనితో పాటు ఈస్‌గాం ప్రాంతానికి చెందిన ఐదుగురిని, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 వేల నగదుతో పాటు 8 సెల్ ఫోన్లు,  కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : “రెండేళ్లుగా పెన్షన్ లేదయ్యా”..చలించిపోయిన కలెక్టర్..

 

 

Related Tags