Breaking News
  • రేపు నెల్లూరు జిల్లా కావలిలో నారా లోకేష్‌ పర్యటన. ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త కార్తీక్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న నారా లోకేష్‌.
  • విజయవాడ: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారు. కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే-నారా లోకేష్‌. భవన నిర్మాణ కార్మికులకు టీడీపీ అండగా పోరాడుతోంది. ఏ పంది కొక్కులు నేడు ఇసుక తింటున్నాయో తేలాలి. టీడీపీ కట్టిన పంచాయతీ ఆఫీస్‌లకు వైసీపీ రంగులు వేసుకుంటోంది. డౌన్‌ డౌన్‌ సీఎం అంటున్నా.. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి-నారా లోకేష్‌
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: సామాన్య భక్తునిగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్నినాని. సుపథం మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్ని నాని
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

రవిప్రకాష్ ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ.. చీఫ్ జస్టిస్‌కు విజయసాయి లేఖ!

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆస్తులుపై ఈడీ విచారణ, స్కామ్‌లపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్‌కు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఫెమా, ఆర్బీఐ రెగ్యులేషన్స్, మనీ లాండరింగ్‌తో పాటు ఐటీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాస్తులను కూడబెట్టారంటూ ఫిర్యాదు చేశారు. రవి ప్రకాష్ హవాలా సొమ్ముతో కెన్యా,ఉగాండాలోని కంపాల సిటీ కేబుల్‌లో పెట్టుబడులు పెట్టారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అంతేకాక రవిప్రకాష్ అవినీతి వ్యాపారాల జాబితాను, పలు సంస్థల్లో ఆయన పెట్టిన షేర్ల వివరాలను సైతం జత చేసి ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌కు లేఖలో రాశారు.

అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకులను మోసం చేసిన మొయిన్ ఖురేషి, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్‌తో కలసి‌ రవిప్రకాష్ చాలా మందిని‌ మోసం చేశారని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. సతీష్ సానా, మొయిన్ ఖురేషి,రవిప్రకాష్ ముగ్గురు కలసి నకిలీ డాక్యుమెంట్‌లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని ఆయన లేఖలో వివరించారు.

టీవీ9లో రూ.18 కోట్ల మేరకు నిధులను దుర్వినియోగం చేసిన కేసులో రవిప్రకాష్ ప్రస్తుతం చెంచల్‌గూడ జైలులో ఉన్నారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కాగా, రవిప్రకాష్‌కు జైలు అధికారులు అండర్ ట్రయిల్ ఖైదీ నెంబర్ 4412ను కేటాయించి.. కృష్ణా బ్యారక్‌లో ఉంచారు.