ఆయన టీడీపీ కోవర్టే.. సుజనాపై వైసీపీ నేత ఆరోపణ

MP Sujana Chowdary is covert to TDP says YCP leader Ramchandrayya, ఆయన టీడీపీ కోవర్టే.. సుజనాపై వైసీపీ నేత ఆరోపణ

బీజేపీలో చేరిన టీడీపీ కోవర్టు సుజనా చౌదరి అంటూ ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సీ. రామచంద్రయ్య. రాష్ట్రంలో టీడీపీకి చేతులు విరిగిపోయాయి గనుక గ్యాపులో బీజేపీ దూరేందుకు ప్రయత్నిస్తుందంటూ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగడంలో తప్పులేదని.. కానీ ఎకనమిక్ టెర్రరిస్టులను, ఫ్యాక్షన్ లీడర్లను చేర్చుకోవడం సరికాదన్నారు.అన్న క్యాంటీన్లలలో కూడా భారీగా అవినీతి జరిగిందని దీన్ని ప్రక్షాళన చేస్తున్నామని అయితే దోపిడీని అరికడుతుంటే హర్షించాల్సిన బీజేపీ.. తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, పీపీఏలను సమీక్షించడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఒక వేళ సమీక్షలు జరిగితే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భయమా అంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచబ్యాంక్ రుణం ఆగిపోవడం మంచిదేనని, ఒకవేళ వచ్చి ఉంటే ఆ భారం ప్రజలపైనే  పడేదని రామంచంద్రయ్య స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *