ఎన్నికలంటే వైసీపీ నేతలు భయపడుతున్నారు.. హైకోర్టు తీర్పు జనగ్‌ సర్కార్‌కు చెంపపెట్టు

వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతోందని రామ్మోహన్‌ నాయుడు ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే..

ఎన్నికలంటే వైసీపీ నేతలు భయపడుతున్నారు.. హైకోర్టు తీర్పు జనగ్‌ సర్కార్‌కు చెంపపెట్టు
Follow us

|

Updated on: Jan 23, 2021 | 5:19 PM

శ్రీకాకుళం: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల మంటలు రాజేస్తూనే ఉంది. ఓవైపు ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి ప్రక్రియను పరుగులెత్తిస్తుండగా.. మరోవైపు అధికార, ప్రతిపక్షాల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు.

స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్ట్‌ తీర్పు జగన్‌ సర్కార్‌కు చెంప పెట్టులాంటిదని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు కామెంట్‌ చేశారు. రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు. ఎన్నికలు జరపకుండా పదే పదే కోర్టులను ఆశ్రయించడమే అందుకు ఉదాహరణ అన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతోందని రామ్మోహన్‌ నాయుడు ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఎలక్షన్స్‌తో వాయిదా కోరుతోందని ఆయన విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ సిద్ధమని ప్రకటించారు. ఎలక్షన్‌ కమిషన్‌కు కులాన్ని ఆపాదించడం ఏపీలోనే చూస్తున్నామని అన్నారు.

చట్టంపై టిడిపి కి నమ్మకం, గౌరవం ఉందన్నారు. గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికల్లో గెలిచి, అధికార పార్టీకి టీడీపీ అంటే ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి మసలుకోవాలని హితవు పలికారు.