కఠిన శిక్షలు తప్పవు : ఎంపీ మోపిదేవి

రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఉరుకొనే ప్రసక్తే లేదని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. అటువంటి వారికి కఠిన శిక్ష తప్పదని తెలిపారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సింహాచలంలో కొలువైన సింహాద్రి అప్పన స్వామిని ఎంపీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మత కలహాలు సృష్టించే ప్రయత్నం […]

కఠిన శిక్షలు తప్పవు : ఎంపీ మోపిదేవి
Follow us

|

Updated on: Sep 26, 2020 | 3:12 PM

రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఉరుకొనే ప్రసక్తే లేదని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. అటువంటి వారికి కఠిన శిక్ష తప్పదని తెలిపారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సింహాచలంలో కొలువైన సింహాద్రి అప్పన స్వామిని ఎంపీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మత కలహాలు సృష్టించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని ఆరోపించారు.

మత కలహాలు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు.. కులాలు మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు. మంత్రి వెంట సూరి శెట్టి సూరి బాబు, రచ్చ వర్మ, రాంప్రసాద్, స్థానిక వైసిపి కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు.