కరెన్సీ నోటుపై గాడ్సే బొమ్మ.. నెట్టింట్లో వైరల్‌..

మహాత్మాగాంధీని కాల్చి చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడు అని నటుడు నాగబాబు చేసిన ట్వీట్ పెద్ద దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఏబీవీపీ కార్యకర్త ఏకంగా రూ. 10 నోట్ మీద గాంధీ స్థానంలో గాడ్సే ఫోటోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిద్ది జిల్లాలో చోటు చేసుకుంది. శివమ్ శుక్లా అనే ఏబీవీపీ లీడర్.. పది రూపాయల నోటుపై గాంధీ స్థానంలో […]

కరెన్సీ నోటుపై గాడ్సే బొమ్మ.. నెట్టింట్లో వైరల్‌..
Follow us

|

Updated on: May 25, 2020 | 3:09 PM

మహాత్మాగాంధీని కాల్చి చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడు అని నటుడు నాగబాబు చేసిన ట్వీట్ పెద్ద దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఏబీవీపీ కార్యకర్త ఏకంగా రూ. 10 నోట్ మీద గాంధీ స్థానంలో గాడ్సే ఫోటోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిద్ది జిల్లాలో చోటు చేసుకుంది.

శివమ్ శుక్లా అనే ఏబీవీపీ లీడర్.. పది రూపాయల నోటుపై గాంధీ స్థానంలో గాడ్సే ఫోటోను మార్ఫ్ చేసి.. ‘Long Live Nathuram Godse’ అంటూ మే 19వ తేదీన సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దీనిపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అఫ్ ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి శుక్లాపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనితో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి శివమ్ శుక్లా కోసం గాలిస్తున్నారు.