పార్లమెంట్ లో గళమెత్తిన కోమటిరెడ్డి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వాస్తవాలను దాచి పెడుతుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ లోక్‌సభలో ప్రస్తావించారు. తెలంగాణలో కోవిడ్ 19 వ్యాప్తి పరిస్థితులపై లోక్‌సభ జీరో అవర్‌లో..

పార్లమెంట్ లో గళమెత్తిన కోమటిరెడ్డి
Follow us

|

Updated on: Sep 14, 2020 | 4:43 PM

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వాస్తవాలను దాచి పెడుతుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ లోక్‌సభలో ప్రస్తావించారు. తెలంగాణలో కోవిడ్ 19 వ్యాప్తి పరిస్థితులపై లోక్‌సభ జీరో అవర్‌లో 377 క్రింద చర్చ లేవనెత్తిన సందర్భంలో కోమటిరెడ్డి పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మార్చి నెల నుంచి జూలై వరకు రోజువారి టెస్టుల సంఖ్యని వెల్లడి చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనే అని కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న వివరాలకు జిల్లాల నుంచి వస్తున్న కేసుల వివరాలకు సరిపోలడం లేదన్నారు. కరోనా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు పలుమార్లు చివాట్లు పెట్టిన విషయాన్ని ఆయన లోక్‌సభ దృష్టికి తెచ్చారు. సెప్టెంబర్ మొదటి వారంలో కొత్తగా 1000 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయినప్పటికీ జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, గజ్వేల్, అదిలాబాదు, కామారెడ్డి జిల్లాల్లోని కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రుల్లో ఒక్క బెడ్ కూడా భర్తీ కాకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఒక జ్యుడీషియల్ ఎంక్వయిరీ కూడా జరిపించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.