టీడీపీ అధిష్టానంపై ఎంపీ కేశినేని అలక

టీడీపీ అధిష్టానంపై ఎంపీ కేశినేని నాని అలక బూనారు. ఇటీవల పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రామ్మెహన్ నాయుడును నియమించిన పార్టీ అధినేత చంద్రబాబు.. పార్టీ విప్‌గా కేశినేని నానిని ఎంపిక చేశారు. అయితే ఈ పదవిపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ తెలిపారు. కానీ ఈ పదవిని తాను స్వీకరించలేనని.. తాను అంత సమర్ధుడిని కాదంటూ కేశినేని నాని […]

టీడీపీ అధిష్టానంపై ఎంపీ కేశినేని అలక
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2019 | 10:19 AM

టీడీపీ అధిష్టానంపై ఎంపీ కేశినేని నాని అలక బూనారు. ఇటీవల పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రామ్మెహన్ నాయుడును నియమించిన పార్టీ అధినేత చంద్రబాబు.. పార్టీ విప్‌గా కేశినేని నానిని ఎంపిక చేశారు. అయితే ఈ పదవిపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ తెలిపారు. కానీ ఈ పదవిని తాను స్వీకరించలేనని.. తాను అంత సమర్ధుడిని కాదంటూ కేశినేని నాని పరోక్షంగా అధినేత నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో సమర్థవంతమైన నేతలకు ఈ పదవులు ఇవ్వండి అంటూ ఆయన సలహా ఇచ్చారు. ఇక తాను బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమన్న ఆయన.. తనకు ఆ అవసరం లేదంటూ పేర్కొన్నారు. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యం కల్పించడం లేదంటూ గత కొన్నిరోజులుగా అసంతృప్తితో ఉన్న కేశినేని.. ఇటీవల ఆయన నియోజకవర్గంలో చంద్రబాబు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు గైర్హాజరైన విషయం తెలిసిందే.