రేయ్ రారా.. కూర్చో నా పక్కన: సీఐకి గోరంట్ల మాధవ్ పిలుపు

MP Gorantla Madhav meets his childhood friend Anantapur Rural CI Muralidhar Reddy

అనంతపురం రూరల్ పరిధిలోని కొడిమి గ్రామ సమీపంలో వన మహోత్సవ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. బందోబస్తుగా అనంతపురం రూరల్ సీఐ డి మురళీధర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సమావేశంలో సభ నిర్వాహకులు అతిథులును ఒక్కొక్కరుగా పిలుస్తున్నారు. అంతలోనే బిగ్గరగా ఒక అరుపు.. రేయ్ రారా మురళీధర్ రెడ్డి అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ సీఐను పిలవడంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం ఆవహించింది. సీఐ మురళీధర్ రావడంతోనే వేదికపైనే గట్టిగా హత్తుకొని నా ప్రాణ స్నేహితుడు నాకే బందోబస్తు నిర్వహించడం ఏమిటి, నా పక్కన కూర్చో అంటూ ఎంపీ మాధవ్ అతనిని హత్తుకున్నాడు. ఇద్దరూ వేదికపై కూర్చొని సభా కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీ పదవి దక్కిన స్నేహం విలువ తెలిసిన గొప్ప వ్యక్తిగా మాధవ్‌ను కొందరు ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో విధి నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించే మురళీ లాంటి అధికారి మన జిల్లాకు లభించడం అదృష్టమని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. మురళి మంచి ఇంటలిజెంట్ అని, కాస్తలో ఉన్నతోద్యోగాలు తప్పిపోయినట్లు ఆయన వివరించారు. 1998లో పోస్టింగ్ లభించినప్పుడు నుండి ఇప్పటివరకు తమ స్నేహబంధం కొనసాగుతున్నదని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *