Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే: జయదేవ్

MP Galla Jayadev Slams AP Government

ఎంపీ గల్లా జయదేవ్‌.. కృష్ణా జిల్లాలోని లంక గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని.. దీన్ని పట్టించుకోని ఆయన.. అమెరికాలో హాయిగా పర్యటనలు చేస్తున్నారని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు ఎంపీ గల్లా జయదేవ్.

‘వర్షాలు లేకుండా ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి వరదలు చూడలేదని.. అక్కడి ప్రజలు వాపోయారని అన్నారు. మహారాష్ట్ర , కర్నాటక రాష్ట్రాలనుంచి ముందు సమాచారం వచ్చినా.. జగన్ ప్రభుత్వం.. సరైన చర్యలు తీసుకోకుండా ఒకేసారి డ్యామ్ గేట్స్ ఓపెన్ చెయ్యటం వల్లనే ఇంత అనర్థం చోటుచేసుకుందని.. దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యమనలా? ప్రభుత్వ అసమర్థత? అనాలా’ అంటూ ప్రశ్నించారు ఎంపీ గల్లా జయదేవ్.