Good News జూన్ నుంచి సినిమా షూటింగులు

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ...

Good News జూన్ నుంచి సినిమా షూటింగులు
Follow us

|

Updated on: May 22, 2020 | 7:33 PM

Chief Minister of Telangana K Chandrashekhar Rao has given indication that movie shootings may re-start in June: లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.

సినీ రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌లతోపాటు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, జెమిని కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు సీఎంను కలిసిన వారిలో వున్నారు. సినిమా షూటింగులు, ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు.

సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున ప్రొడక్షన్ పనులు, షూటింగుల కొనసాగింపు, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇన్ డోర్‌లో చేసే వీలున్న ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సిఎం చెప్పారు.

తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సిఎం అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు.

ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సిఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత, అప్పటి పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎం చెప్పారు. ముఖ్యమంత్రి స్పందనపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.