Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

సిమ్ లేని స్మార్ట్ ఫోన్

Motorola New Simless Phone, సిమ్ లేని స్మార్ట్ ఫోన్

ఫోల్డింగ్ ఫోన్.. ఫోన్ల చరిత్రలో సంచలనం రేపిన ఫోన్. అప్పట్లో మోటొరోలా లాంచ్ చేసిన ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఫోన్స్ మరోసారి మార్కెట్లోకి రానున్నాయి. మోటో బ్రాండ్ పేరుతో ఫేమసయిన పాత మోడల్ ఫోన్నే కొంచెం కొత్తగా, మరింత స్మార్ట్గా రేజర్ పేరుతో తీసుకొచ్చేసింది మోటొరోలా. చూడటానికి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ లాగానే కనిపించే ఈ స్మార్ట్ ఫోన్నీ అమాంతం మధ్యలోకి మడతపెట్టేయవచ్చు. పాత మోడల్ ఫోన్లలో పైన భాగంలో స్క్రీన్, కింద భాగంలో కీపాడ్ ఉండేవి, కానీ రేజర్ ఫ్లిప్ ఫోన్లో మాత్రం రెండు వైపులా స్క్రీనే ఉండటం విశేషం.. ఇప్పటివరకూ ఫోల్డబుల్‌ ఫోన్స్‌ తయారుచేస్తున్న కంపెనీలు తామ ఫోల్డబుల్‌ ఫోన్‌ని మడతపెట్టినప్పటికి మామూలు సైజ్‌లోనే ఉండేలా డిజైన్ చేసుకున్నాయి.. అయితే, మోటో రేజర్ మాత్రం మడవగానే కాంపాక్ట్ సైజ్ లోకి మారి చిన్నదిగా మారడం విశేషం.

ఇక ఈ ఫోన్ ఫీచర్స్ గురించి చెప్పుకుంటే ఇందులో 6.2 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది, క్లోజ్ చేసినప్పుడు అది కాస్తా 2.7 ఇంచెస్ లోకి మారి క్విక్ వ్యూ డిస్ప్లే మొదలవుతుంది. ఆ డిస్ప్లేలోనే నోటిఫికేషన్లు కనిపిస్తాయి. స్మార్ట్ ఫోన్లో ఉండే అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ రేజర్ సొంతం. 16 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ రీడర్, యాంబియెంట్ లైట్, జీపీఎస్ కూడా ఈ ఫోన్లో ఇన్బిల్ట్ గా వస్తాయి. 2510 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఫోన్లోనే ఫిక్స్ అయి ఉంటుంది. 4జీ కనెక్టివిటీతో వచ్చే ఈ ఫోన్.. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని మోటొరోలా నిర్వాహకులు చెబుతున్నారు. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇందులో సిమ్ కార్డ్ స్లాట్ లేదు, కానీ ఇది eSIM కార్డులకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉండగా, వచ్చే ఏడాది ఇతర దేశాల్లో విడుదల చేయనున్నారు..కాగా, ఈ ఫోన్ ధరను 1499 డాలర్లుగా నిర్ణయించారు.

మరిన్ని ఫీచర్స్:
* 876×2142 పిక్సెల్స్ రిజల్యూషన్‌,
* కవర్ డిస్‌ప్లే 600×800 పిక్సెల్స్ రిజల్యూషన్,
* క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 సాక్‌,
* 6 జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్