నయా ఫైన్స్‌లో పీక్స్…ట్రక్కు డ్రైవర్‌కు రూ. 2 లక్షల జరిమానా!

కొత్త మోటార్ వెహికల్ సవరణ చట్టం వచ్చిన తర్వాత పోలీసులు నిబంధనలు పాటించని వాహన డ్రైవర్ల బెండు తీస్తున్నారు. భారీ స్థాయిలో ఫైన్లు వేస్తూ బండి బయటకు తీయాలంటే భయపడేలా చేస్తున్నారు. ఒక్కోక్క చోటైతో వాహనాల ధరలకు మించి జరిమానాలను వాయిస్తున్నారు. దీంతో బండ్ల అక్కడే వదిలేసి వెళ్లినవారు, ఆగ్రహంతో తగలబెట్టినవారు కూడా లేకపోలేదు. ఇప్పటివరకు వేలల్లోనే ఫైన్లు చూశాం. కానీ ఇప్పుడు జరిమానాల రేంజ్ ఏకంగా లక్షల వరకు వెళ్లింది. రోజుకో నయా రికార్డ్ క్రియేట్ […]

నయా ఫైన్స్‌లో పీక్స్...ట్రక్కు డ్రైవర్‌కు రూ. 2 లక్షల జరిమానా!
Motor Vehicle Amendment Act: Now, Truck Driver in Delhi Fined Rs 2,00,500 For Overloading
Follow us

|

Updated on: Sep 13, 2019 | 3:29 AM

కొత్త మోటార్ వెహికల్ సవరణ చట్టం వచ్చిన తర్వాత పోలీసులు నిబంధనలు పాటించని వాహన డ్రైవర్ల బెండు తీస్తున్నారు. భారీ స్థాయిలో ఫైన్లు వేస్తూ బండి బయటకు తీయాలంటే భయపడేలా చేస్తున్నారు. ఒక్కోక్క చోటైతో వాహనాల ధరలకు మించి జరిమానాలను వాయిస్తున్నారు. దీంతో బండ్ల అక్కడే వదిలేసి వెళ్లినవారు, ఆగ్రహంతో తగలబెట్టినవారు కూడా లేకపోలేదు. ఇప్పటివరకు వేలల్లోనే ఫైన్లు చూశాం. కానీ ఇప్పుడు జరిమానాల రేంజ్ ఏకంగా లక్షల వరకు వెళ్లింది. రోజుకో నయా రికార్డ్ క్రియేట్ చేస్తూ కొత్త చట్టం ఫైన్లు వాహనదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ ట్రక్ డ్రైవర్‌కు ఏకంగా రూ.2,00,500 జరిమానా విధించారు. ఢిల్లీలోని ముకర్బా చౌక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

దేశంలో ఇప్పటి వరకు నమోదైన జరిమానాల రికార్డులలో ఈ చలాన్ హయ్యస్ట్‌గా నిలిచింది. ఓవర్‌ లోడ్‌ కారణంగా లారీ డ్రైవర్‌ రూ.2 లక్షల 500 రూపాయాలను జరిమానా విధించారు. అంతేకాదు డ్రైవర్ రామ్ కిషన్ అరెస్ట్ చేశారు. నూతన వాహన చట్టం ప్రకారం లారీలో, ట్రక్కులో పరిమితికి మించి లోడ్ ఉంటే రూ.20వేలు జరిమానా విధిస్తారు. నిర్దేశించిన లోడ్‌కు మించి తీసుకెళ్తున్న ప్రతి టన్నుకు అదనంగా రూ.2వేల ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే పరిమితికి మించి ఎంత ఎక్కువ లోడ్ ఉంటే అంత భారీగా జరిమానా పడుతుందన్న మాట..!. సెప్టెంబరు 1 దేశంవ్యాప్తంగా నుంచి నూతన వాహన చట్టం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

ప్రమాదాలు నివారించడానికే అధిక జరిమానాలు విధిస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం నూతన రవాణా చట్టం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిమానాలు పెద్ద మొత్తంలో ఉండటమే ఇందుకు కారణంగా ఉంది.

కేంద్ర చట్టాన్ని యథాతధంగా అమలు చేయడానికి అనేక రాష్ట్రాలు నిరాకరించడం, జరిమానాల తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తుండడంతో కేంద్రం దీనిపై మరోసారి దృష్టిపెట్టింది. ‘కేంద్రం రూపొందించిన నిబంధనలను రాష్ట్రాలు తిరస్కరించవచ్చా? కనీస జరిమానా కంటే తక్కువ జరిమానాలను రాష్ట్రాలు సొంతంగా విధించుకోవచ్చా?” అని న్యాయ మంత్రిత్వ శాఖను సలహా కోరుతూ బుధవారం ఓ నోట్‌ను రోడ్లు, రవాణా శాఖ పంపింది. ”ఫలానా అంత మొత్తం దాకా జరిమానా విధించవచ్చు అని చట్టంలో పేర్కొన్నాం. కనీస జరిమానా అనేది కూడా స్పష్టంగా చెప్పాం.

ఈ కనీస జరిమానా కూడా విధించకపోతే ఎలా? ఒకవేళ రాష్ట్రాలు గనక కనీస పరిమితి కంటే తక్కువ చేసుకుంటే అప్పుడు తగిన విధంగా చర్యలు తీసుకుంటాం” అని రవాణా శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కాంగ్రెస్‌-పాలిత ఐదు రాష్ట్రాల్లో నాలుగు.. ప్రాంతీయ పక్షాలు అధికారంలో ఉన్న బెంగాల్‌, తెలంగాణ, ఒడిసా కూడా ఈ కొత్త నిబంధనలను అమలు చేయకుండా అధ్యయనానికే పరిమితమయ్యాయి. విశేషమేమంటే ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, ఉత్తరాఖండ్‌.. మొదలైన బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలూ వీటి అమలుకు విముఖత చూపుతున్నారు. ఎన్నికలు జరగనున్న మరో మూడు రాష్ట్రాలు- మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానాల్లోని బీజేపీ సర్కార్లు కూడా అదే బాటలో ఉన్నాయి. చట్టం అమలు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఈ న్యాయ సలహా కోరింది.