వాహనదారులకు అలర్ట్: మారబోతున్న రూల్స్..డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ నిబంధనలో మార్పు !

కరోనా, లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. భారత్‌లోనూ లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో చాలా రూల్స్ మారాయి. ఇటువంటి తరుణంలో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలు కూడా..

వాహనదారులకు అలర్ట్: మారబోతున్న రూల్స్..డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ నిబంధనలో మార్పు !
Follow us

|

Updated on: Jun 05, 2020 | 11:10 AM

కరోనా, లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. భారత్‌లోనూ లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో చాలా రూల్స్ మారాయి. సాధారణ జనజీవన విధానం నుంచి వీఐపీల వరకు తప్పని సరి నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుడి, బడి మొదలగు అన్ని చోట్ల రూల్స్ తప్పనిసరి అయిపోయింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలు కూడా మారనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై కసరత్తు చేపట్టింది. మోటార్ వెహికిల్ చట్టానికి సవరణలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పరిశ్రామిక వర్గాలు, ఇతరుల నుంచి సలహాలు, సూచనలు సేకరిస్తోంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త మార్పులను అమల్లోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ మేరకు.. ఒక వాహనంలో లోపాలు ఉంటే.. అప్పుడు దాన్ని తయారు చేసిన కంపెనీపై జరిమానా మరింత పెరుగుతుంది. ఈ పెనాల్టీ రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండొచ్చునని, జరిమానా మొత్తం వెహికల్ రకం, లోపాల ప్రాతిపదికన మారుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఓల్డ్ వెహికల్స్ వంటి వాటికి సంబంధించిన రూల్స్ మార్పునకు మార్చి నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై పరిశ్రమ వర్గాల నుంచి అభిప్రాయాలు కోరింది. అయితే లాక్ డౌన్ పరిస్థితుల్లో మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. మళ్లీ సలహాలు, సూచనలు కోరింది.

ఇదిలా ఉంటే, మోదీ సర్కార్ త్వరలో మరో కొత్త స్కీమ్ అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మోటార్ క్యాబ్ రెంట్ స్కీమ్ అనే కొత్త పథకాన్ని లాంచ్ చేయనుంది. ఇందులో భాగంగా కారు, టూవీరల్, సైకిల్ వంటి వాటిని అద్దెకు తీసుకునే అవకాశం కల్పించనుంది. దీని ద్వారా సొంతంగా వాహనాలు కొనుగోలు చేయలేని వారికి మేలు కలిగే ఛాన్స్ ఉంటుంది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన