మోత్కుపల్లికి కాషాయతీర్థం..వ్యూహం అదుర్స్

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాలిటిక్స్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయన బిజెపిలో చేరారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా వున్నప్పడు నల్గొండ జిల్లాల్లో తిరుగులేని నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. దళిత నేతగా ప్రస్తానాన్ని ప్రారంభించి.. తొలుత స్వర్గీయ ఎన్టీయార్ ప్రోత్సాహంతో.. ఆ తర్వాత చంద్రబాబు అండదండలతో మోత్కుపల్లి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిర తీరుు అందరికి తెలిసిందే. కెసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత సుమారు పదేళ్ళ పాటు పలు సందర్భాలలో గులాబీ బాస్‌ను టార్గెట్ […]

మోత్కుపల్లికి కాషాయతీర్థం..వ్యూహం అదుర్స్
Follow us

|

Updated on: Nov 04, 2019 | 6:49 PM

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాలిటిక్స్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయన బిజెపిలో చేరారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా వున్నప్పడు నల్గొండ జిల్లాల్లో తిరుగులేని నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. దళిత నేతగా ప్రస్తానాన్ని ప్రారంభించి.. తొలుత స్వర్గీయ ఎన్టీయార్ ప్రోత్సాహంతో.. ఆ తర్వాత చంద్రబాబు అండదండలతో మోత్కుపల్లి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిర తీరుు అందరికి తెలిసిందే. కెసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత సుమారు పదేళ్ళ పాటు పలు సందర్భాలలో గులాబీ బాస్‌ను టార్గెట్ చేసేందుకు చంద్రబాబు వాడిన ప్రధాన అస్త్రం మోత్కుపల్లినే.
అయితే రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు అంతర్థానం అయింది. చంద్రబాబు అడపాదడపా ఇక్కడా పార్టీని బలోపేతం చేస్తామంటూ చేసిన ఒకటి, అరా ప్రకటనలు.. రెండు, మూడు సార్లు పార్టీ సమీక్షలు తప్ప.. గ్రౌండ్ లెవల్‌లో టిడిపి క్యాడరే లేదన్నది నిర్వివాదాంశం. అందుకే చాలా మంది తెలంగాణ టిడిపి నేతలు టిఆర్ఎస్ పార్టీలోకి చేరిపోగా.. కెసీఆర్‌తో పొసగని వారు బిజెపిలో జాయిన్ అవుతున్నారు. ఈ కోవలోనే మోత్కుపల్లి కూడా వస్తారని చాలా మంది భావిస్తున్నారు.
నిజానికి చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేసిన మోత్కుపల్లికి గులాబీ పార్టీ ఘన స్వాగతం పలుకుతుందని ఏడాది క్రితం అందరూ అనుకున్నారు. కానీ.. కెసీఆర్ పెద్దగా స్పందించకపోవడంతో మోత్కుపల్లి ఏడాదికాలం దాదాపు మౌనంగానే వున్నారు. తాజాగా ఆయన ఢిల్లీ వెళ్ళి.. బిజెపి కండువా కప్పుకున్నారు. మరి మోత్కుపల్లి వ్యూహం ఏమై వుంటుందా అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే ఏదైనా పెద్ద పార్టీ అండ అవసరం. తెలంగాణ పాటిలిక్స్‌ని గమనిస్తే.. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలే ప్రధాన పార్టీలుగా కనిపిస్తున్నాయి. వామపక్షాలతోపాటు చిన్నా చితకా పార్టీలున్నా వాటి ప్రభావం అంతంత మాత్రమే.
ఈ నేపథ్యంలో మోత్కుపల్లి లాంటి పొలిటికల్ యాంబిషన్స్ అధికంగా వున్న నేతలు.. భవిష్యత్ ఎంతో కొంత కనిపిస్తున్న పార్టీల వైపే మొగ్గుచూపుతారు. అందుకే ఆయన ఆపరేషన్ కమలం ద‌ృష్టిలో పడి వుంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆలేరులో తిరుగులేని నేతగా ఒకప్పుడున్న మోత్కుపల్లి.. గత కొన్నేళ్ళుగా.. వెనకబడిపోయారు.
ఈ క్రమంలో వచ్చే నాలుగేళ్ళలో బిజెపి క్యాడర్‌ని, తన సొంత అనుచరులను కలుపుకుని గ్రౌండ్ సిద్దం చేసుకోవాలన్నదే మోత్కుపల్లి నర్సింహులు వ్యూహమని తెలుస్తోంది. అదే సమయంలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపై కూడా దృష్టి పెట్టాలని, నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి జాతీయ నేతల చరిష్మాతో విజయం సాధిస్తే.. జాతీయ స్థాయిలో తనకు ప్రభావం పెరుగుతుందని మోత్కుపల్లి భావిస్తున్నారని, దానికి తన దళిత కార్డు కూడా పనికొస్తుందని ఆయన విశ్వసిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. లెట్ అజ్ విష్ మోత్కుపల్లి ఆల్ ద బెస్ట్..

రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
పాక్‌కు ఐఎంఎఫ్ గుడ్ న్యూస్ ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు ఔరంగజేబు చేతిలో
పాక్‌కు ఐఎంఎఫ్ గుడ్ న్యూస్ ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు ఔరంగజేబు చేతిలో
ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.