గడుగ్గాయిల అల్లరికి చెక్ పెట్టేందుకు ఆ తల్లి ఏం చేసిందంటే..!

Mother's Super trick, గడుగ్గాయిల అల్లరికి చెక్ పెట్టేందుకు ఆ తల్లి ఏం చేసిందంటే..!

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఆ ఇళ్లు కాస్త చిన్న సైజు సంతలా ఉంటుంది. తమ అల్లరితో ఇళ్లు పీకి పందిరేస్తుంటారు. ఇక వారిని కామ్‌గా ఉంచడమన్నది అంత ఈజీ కాదు. కానీ ఓ చిన్న ట్రిక్‌తో తన పిల్లలను అల్లరి చేయకుండా ఒకే చోట కామ్‌గా ఉంచేలా చేసింది జెస్సికా డీఎంట్రిమోంటో అనే ఓ మదర్. ఆ ట్రిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు సూపర్ ఐడియా.. మీరు గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు పిల్లలను నిశ్శబ్ధంగా ఒకే చోట ఉంచడానికి ఆమె చెప్పిన ట్రిక్ ఏంటంటే..!

‘‘రాత్రిళ్లు మాత్రమే మెరిసే డ్రస్‌లను వారికి కొనండి. అందులోని స్టార్లు రీఛార్జ్ అవ్వాలంటే లైట్ కింద సైలెంట్‌గా ఉండాలని వారికి చెప్పండి ’’అని ఆ ట్రిక్‌ను పేర్కొంది. ఇక ఆ ట్రిక్ ఎలా పనిచేసిందో కూడా ఆమె వివరించింది. ‘‘ఉదయాన వారు స్నానం చేసే సమయానికి ఆ డ్రెస్‌లను వారి వారి సెల్ఫ్‌లలో పెట్టండి. పగటి పూట అవి ఎలాగూ సరిగా మెరవలేవు. ఇక రాత్రికి మెరవాలంటే లైట్‌ కింద సైలెంట్‌గా పడుకోమని చెప్పాను. దాన్ని ఫాలో అయ్యి పడుకోవడానికి ముందు వారు కామ్‌గా లైట్ కింద ఉన్నారు. దీంతో రాత్రి లైట్ ఆఫ్ చేస్తే ఆ డ్రస్‌లు కాస్త మెరిశాయి’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్రిక్‌ సోషల్ మీడియాలో అందరి చేత నవ్వులు పూయిస్తోంది. నిజంగా దీన్ని ఓ సారి ట్రై చేయొచ్చు. మీరు జీనియస్ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Looking for a way to keep your kids still….Buy them glow in the dark pjs. Tell them they have to lie really still…

Jessica D'Entremont यांनी वर पोस्ट केले रविवार, २९ सप्टेंबर, २०१९

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *