దిశ: నిందితుల ఎన్‌కౌంటర్‌పై.. నిర్భయ, ఆయేషా మీరా తల్లుల ఘాటు రియాక్షన్

దిశకు తగిన న్యాయం జరిగిందని.. అందుకు మాకు చాలా సంతోషంగా ఉందంటూ.. నిర్భయ తల్లి, ఆయేషా మీరా తల్లి స్పందించారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని వారు కోరుకున్నారు. కాగా.. ఈ సందర్భంగా నిర్భయ తల్లి మాట్లాడుతూ.. దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని.. మా కూతురు కోసం నేను ఏడేళ్లుగా పోరాడుతున్నా.. అయినా ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ నిందితులను కూడా ఇలాగే శిక్షించాలని నిర్భయ తల్లి డిమాండ్ చేస్తోంది. హ్యాట్సాఫ్ టు […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:26 am, Fri, 6 December 19

దిశకు తగిన న్యాయం జరిగిందని.. అందుకు మాకు చాలా సంతోషంగా ఉందంటూ.. నిర్భయ తల్లి, ఆయేషా మీరా తల్లి స్పందించారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని వారు కోరుకున్నారు. కాగా.. ఈ సందర్భంగా నిర్భయ తల్లి మాట్లాడుతూ.. దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని.. మా కూతురు కోసం నేను ఏడేళ్లుగా పోరాడుతున్నా.. అయినా ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ నిందితులను కూడా ఇలాగే శిక్షించాలని నిర్భయ తల్లి డిమాండ్ చేస్తోంది.

హ్యాట్సాఫ్ టు సజ్జనార్ అంటూ.. ఆయేషా మీర తల్లి.. సైబరాబాద్ సీపీని ప్రశంసించింది. పోలీసులంటే.. నిందితులకు భయం ఉండాలి. ఇక ఇప్పుడైనా దిశ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆయేషా కేసులో నిందితులకు రాజకీయ నేతలు సహకరించారు. అలాగే.. నిర్భయ కేసులో కూడా ఇంకా న్యాయం జరగలేదని.. ఇకనైనా చట్టాలను సవరించాలని ఆయేషా మీర తల్లి మీడియాతో స్పందించింది.