Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

తల్లి మరణం తట్టుకోలేక..ఆ కొడుకు గుండె ఆగింది

Mother and Son died in Khammama District, తల్లి మరణం తట్టుకోలేక..ఆ కొడుకు గుండె ఆగింది

తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు గుండె ఆగిపోయింది. కనిపెంచిన కన్నతల్లి ఇక లేదని తెలిసి ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడు. అమ్మ మరణవార్త విన్న వెంటనే తాను కూడా తనువు చాలించాడు. ఈ విషాదం సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో సంభవించిన తల్లికొడుకుల హఠ్మారణం ఆ ఇంటిని తీరని విషాదంలో ముంచేసింది. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ఒకేరోజు తల్లి కుమారుడు మరణించారు. బచ్చోడు గ్రామానికి చెందిన పులి పలుపుల శాంతమ్మ(70) అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆమె మరణ వార్త విన్న పెద్ద కొడుకు వెంకన్న(50)తల్లి శాంతమ్మ మరణవార్త వినగానే గంట వ్యవధిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఆ కుటుంబంలో శాంతమ్మ కు ఐదుగురు కుమారులు కాగా, వెంకన్న పెద్ద కుమారుడు తల్లి పెద్ద కుమారుడు పై ఎక్కువ ప్రేమానురాగాలు చూపడంతో తల్లి మరణ వార్త విన్న కుమారుడు తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు లోనయ్యాడని, ఆ భాదలోనే హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోయాడని వారి కుటుంబీకులు తెలిపారు. మృతుడు వెంకన్నకు భార్య ఇద్దరు కూతుళ్లు ఓ కుమారుడు ఉన్నారు. ఒకే కుటుంబంలో తల్లికొడుకులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి తో పాటే కుమారుడి దహన సంస్కారాలు కూడా ఒకేసారి నిర్వహించారు.