Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

Crime: ముగ్గురు బిడ్డలతో బావిలో దూకిన తల్లి

పదమూడేళ్ల దాంపత్య జీవితం.. పండంటి ముగ్గురు సంతానం.. అన్యోన్యంగా సాగే కాపురం.. అనుకోని కలహం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.. తాళి కట్టినవాడి కష్టాన్ని అర్థం చేసుకోలేని ఆవేశం తనలో ఆడపిల్లలను సాకలేననే అనుమానాన్నిపెంచింది. భర్తను వదిలి పుట్టింటికి వచ్చినా భారం తగ్గలేదు. మనసు కర్కశంగా మారింది.
Mother suicide attempt with three childrenes in anantapur, Crime: ముగ్గురు బిడ్డలతో బావిలో దూకిన తల్లి

పదమూడేళ్ల దాంపత్య జీవితం.. పండంటి ముగ్గురు సంతానం.. అన్యోన్యంగా సాగే కాపురం.. అనుకోని కలహం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.. తాళి కట్టినవాడి కష్టాన్ని అర్థం చేసుకోలేని ఆవేశం తనలో ఆడపిల్లలను సాకలేననే అనుమానాన్నిపెంచింది. భర్తను వదిలి పుట్టింటికి వచ్చినా భారం తగ్గలేదు. మనసు కర్కశంగా మారింది. చెరువు చూపిస్తానని బిడ్డలను బావిలో తోసేసి తను కూడా ప్రాణాలు తీసుకోవాలనుకుంది. దురదృష్టం ఆమె వెంటే ఉంది….ఈ ఘటనలో తాను బతికి.. పిల్లల్ని పోగొట్టుకుంది. ఏ తల్లికీ ఎన్నడూ రాకూడని కష్టం ఆ తల్లికి వచ్చిపడింది.

పెద్దకమ్మవారిపల్లి దొమ్మరికాలనీకి చెందిన దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకుమారైను కదిరికి చెందిన వ్యక్తితో 13 ఏళ్ల కిందట వివాహం చేశారు. వీరికి మొదటి సంతానంలో ఇద్దరు కవలలు ఆడపిల్లలు పుట్టారు. రెండో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వీరిది. భర్త ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎంతో సంతోషంగా ఉండే కాపురంలో కలతలు రేగాయి.

నాలుగు నెలల నుంచి భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు.. ఈనేపథ్యంలో 20 రోజుల కిందట ఆమె కదిరి నుంచి పుట్టింటికి పిల్లలతో కలిసి వచ్చింది. కొంతకాలంగా కవలలైన వారి పిల్లలతో కలిసి తాత అవ్వ వద్దే ఉంటూ.. పెద్దకమ్మవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో పిల్లల్ని చదివిస్తోంది. ఈ క్రమంలోనే చెరువు చూసొద్దామని ఆ తల్లి తన ముగ్గురు పిల్లలను తీసుకెళ్లింది. అక్కడే ఉన్న బావిలో ఇద్దరు చిన్నారులను ముందు తోసేసింది. అనంతరం చంటిబిడ్డతో కలిసి తానూ దూకేసింది. సమీపంలోని స్థానికులు వెంటనే బావిలోకి దిగి ఆమెను, పసిపాపను బయటకు తీశారు. చిన్నారిని సత్యసాయి జనరల్‌ ఆసుపత్రికి తరలించగా, ఆ చిన్నారి అక్కడ తుదిశ్వాస విడిచింది. తల్లి ప్రాణాలతో బయటపడింది.

కవలలైన ఇద్దరు చిన్నారుల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. అల్లారుముద్దుగా ఉండి, అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉండే చిన్నారుల మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రామకృష్ణయ్య పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల మృతిపై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబానికి సానుభూతి తెలిపారు.. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.

Related Tags