కుక్కను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయారు

mother son and a dog died of electrick shock in maharashtra, కుక్కను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయారు

ఇంట్లో ప్రేమగా  పెంచుకుంటున్న కుక్కును రక్షించబోయి ఓ తల్లి, కొడుకు తమ ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన మహారాష్ట్రలో జరిగింది.  వివరాలు చూస్తే ..మహారాష్ట్ర వార్దాలో స్దానిక హింద్ నగర్‌లో రోహిత్ (23) అనే యువకుడు కుటుంబంతో సహా నివసిస్తున్నాడు.

అయితే గురువారం కరెంటు ఐరన్ బాక్స్‌తో తన బట్టలు ఇస్త్రీ చేసుకోడానికి రెడీ అయ్యాడు. ఇస్త్రీ పెట్టెకు ఉన్న వైర్ అప్పటికే ఎలుకలు కొరకడంతో జాగ్రత్తగా ఇస్త్రీ చేసుకోవడం ప్రారంభించాడు. అయితే అతని వద్దకు వచ్చిన పెంపుడు కుక్క ఇస్త్రీపెట్టె వైరును చుట్టుకోవడంతో దానికి కరెంట్ షాక్ తగిలింది. దాన్ని విడిపించే క్రమంలో రోహిత్‌ కుక్కను పట్టుకోవడంతో అతడికి విద్యుత్ షాక్ కొట్టింది.. కుక్కతో పాటు రోహిత్ అరుపులు విన్న తల్లి దీపాలీ పరిగెత్తుకుని వచ్చి ఏం చేయాలో అర్ధంకాక కొడుకును విడదీయబోయి అతడ్ని పట్టుకుంది. దీంతో తల్లి దీపాలీకి కూడా కరెంట్ షాక్ కొట్టింది. వీరంతా విద్యుదాఘాతంతో విలవిలలాడుతుంటే అంతలో వచ్చిన దీపాలీ భర్త సిద్ధార్ధ వీరందరినీ రక్షించబోయి పట్టుకున్నాడు. వెంటనే ఆయనకు కూడా షాక్ తగిలింది.

అయితే అప్పడే వచ్చిన పెద్ద కొడుకు ప్రవీణ్ వీరందరినీ చూసి వెంటనే కరెంట్ మెయిన్ స్విచ్ కట్టేశాడు. దీంతో విద్యుత్ సప్లై ఆగిపోయింది. ఈ దుర్ఘటనలో కుక్కతో పాటు రోహిత్ అక్కడికక్కడే చనిపోగా తల్లి దీపాలీ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మ‌ృత్యువాత పడింది. కరెంటు షాక్ కొట్టిన తండ్రి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటన స్ధానికంగా కలకలం రేపింది. ఏకంగా ఓ కుటుంబంలో ముగ్గురు కరెంట్ షాక్‌తో బలికావడంతో అందరికీ కన్నీరు తెప్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *