పిల్లలకు డబ్బు విలువ తెలియాలంటే.. ఆ తల్లి సూపర్ ఐడియా..

Mother Holds Job Interviews To Teach Her Kids About Money, పిల్లలకు డబ్బు విలువ తెలియాలంటే.. ఆ తల్లి సూపర్ ఐడియా..

పిల్లలకు డబ్బు విలువ తెలిసేలా చేయడానికి ఓ తల్లి చేసిన పనికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. అయితే పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వడం వల్ల వారికి డబ్బు విలువ తెలియకుండా పోతోందని ఆమెరికాకు చెందిన మరియన్ మెక్‌గ్రెగోర్ చెబుతోంది. జార్జియా రాష్ట్రంలోని డబ్లిన్ ప్రాంతంలో మెక్ గ్రెగోర్ తన పిల్లలతో నివశిస్తోంది. ఆమె పిల్లలు ఒక రోజు మొబైల్ కొనిపెట్టమని అడిగారు. తరువాత రోజు వేరే ఊరికి ట్రిప్‌కు తీసుకెళ్లమని అడిగారు. అయితే ఇలా వారు అడిగినదల్లా చేస్తూ వచ్చింది. కాని ఒకరోజు తన పిల్లలు స్కూలు నుంచి తిరిగివచ్చే సరికి గోడపై ఒక పేపర్ అతికించింది. అందులో కిచెన్ మేనేజర్, లీడ్ హౌస్ కీపర్, లాండ్రీ సూపర్‌వైజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. ఇందుకు ఉద్యోగులు కావాలని రాసి ఉంది. అది చూసిన పిల్లలు షాక్ అయ్యారు. అయితే పిల్లలతోనే ఇంట్లో పనులు చేయించి.. వారు అడిగినది కొనివ్వాలన్న తన ఐడియాలో భాగంగా ఆమె ఈ ట్రిక్ ప్లే చేసింది. ఈ ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో మెక్ గ్రెగోర్ ఫోస్టు చేయగా.. లక్షలాది మంది నెటిజెన్లు ఈ పోస్టు పై స్పందించారు. పిల్లలకు డబ్బు విలువ తెలిసేలా చేయాలంటే ఇది సూపర్ ఐడియా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *