Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

ప్రమాదంలో పిల్ల ఏనుగు..థ్యాంక్స్‌ చెప్పిన తల్లి !

A video of baby elephant getting rescued from a ditch is going viral online, ప్రమాదంలో పిల్ల ఏనుగు..థ్యాంక్స్‌ చెప్పిన తల్లి !
మనుషుల్లో కనిపించని విశ్వాసం, మానవత్వం, మంచితనాలు జంతువుల్లో మాత్రం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకొవచ్చు. సాటి మనిషి సాయం చేసినా, వారికి చెడు చేయడమే నేటి సమాజంలో ఎక్కుగా చూస్తున్నాం. కానీ, మనిషి చేసిన సాయానికి వినయంగా కృతజ్ఞతలు చెప్పుకుంది ఓ తల్లి ఏనుగు. ప్రమాదం నుంచి తన బిడ్డను రక్షించిన అధికారులకు  ఆ తల్లి పలుమార్లు తొండం ఎత్తి ధన్యవాదాలు తెలుపుతూ… చూసిన వారందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. కేరళలో చోటుచేసుకున్నట్లుగా తెలుస్తున్న ఆ వీడియోలో..ఓ గుంతలో పడిపోయిన ఏనుగు పిల్లను రక్షించడానికి పెద్ద ఏనుగులు చాలా ప్రయత్నించాయి. గున్నను బయటికి తీయడం వాటికి సాధ్యం కాలేదు. ఇంతలో అటవీ సిబ్బంది, స్థానికులు అక్కడికి వచ్చారు. పెద్ద ఏనుగులు చాటుకు తప్పుకున్నాయి. జనం జేసీబీ సాయంతో మట్టిని గుంతలో నింపడంతో పిల్ల ఏనుగు బయటికి వచ్చింది. పెద్ద ఏనుగులు దాన్ని అక్కున్న చేర్చుకున్నాయి. తల్లి ఏనుగు తన పిల్లను కాపాడినందుకు కృతజ్ఞతగా తొండాన్ని మనుషులవైపు పైకి చాచింది. మళ్లీ మళ్లీ పైకెత్తి ధన్యావాదాలు తెలిపింది. తర్వాత మిగతా ఏనుగులతో కలసి పిల్లను తీసుకుని అడవుల్లోకి వెళ్లింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. లక్షల సంఖ్యలో దీనికి లైకులు, కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.