హైదరాబాద్ సాగర్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం… తల్లి,కొడుకుల దుర్మరణం

రంగారెడ్డి జిల్లాలో జిల్లాలో జరగిరి ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. తుర్క యాంజల్ మున్సిపాలిటీ అదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని రాగన్నగూడా వద్ద సాగర్ రహదారిపై గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 8:30 am, Fri, 13 November 20
హైదరాబాద్ సాగర్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం... తల్లి,కొడుకుల దుర్మరణం

రంగారెడ్డి జిల్లాలో జిల్లాలో జరగిరి ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. తుర్క యాంజల్ మున్సిపాలిటీ అదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని రాగన్నగూడా వద్ద సాగర్ రహదారిపై గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. యమహా ఫాసినో బైకును టాటా సఫారీ వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తల్లి కొడుకుగా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మ‌ృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు రాగన్నగూడాలోని జీవీఆర్ కాలనీలో నివాసముండే సంరెడ్డి ప్రదీప్ రెడ్డి(19), సంరెడ్డి చంద్రకళ(48)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.