అమ్మకో తోడు… సమ్మతి తెలిపిని ఐదుగురు పిల్లలు… ఒకే వేదికపై తల్లి, కూతురి వివాహం…

గోరఖ్‌పూర్‌లోని పిప్రౌలి బ్లాక్‌లో సామూహిక వివాహలు జరిగాయి. అయితే ఒక వివాహం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.

అమ్మకో తోడు... సమ్మతి తెలిపిని ఐదుగురు పిల్లలు... ఒకే వేదికపై తల్లి, కూతురి వివాహం...
Follow us

| Edited By:

Updated on: Dec 12, 2020 | 6:39 PM

గోరఖ్‌పూర్‌లోని పిప్రౌలి బ్లాక్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన కార్యక్రమంలో భాగంగా ఒకే సామూహిక వివాహ వేదికలో చాలామంది జంటలకు వివాహాలు జరిగాయి. అయితే ఒక వివాహం మాత్రం అక్కడ హాట్ టాపిక్ అయ్యింది. ఒకే ముహూర్తంలో, ఒకే వేదికపై తల్లి, కూతురు వివాహాలు జరిగాయి. వితంతువు అయిన ఆ మహిళ తన భర్త తమ్ముడిని వివాహం చేసుకుంది.

పిల్లల పెంపకంలోనే….

53 ఏళ్ళ బెలీ దేవికి ముగ్గురు కుమార్తెలు , ఇద్దరు కుమారులు ఉన్నారు. 25 సంవత్సరాల క్రితం బెలీ దేవి భర్త హరిహర్ మరణించారు . అప్పటి నుండి బెలీ దేవిపిల్లల్ని కష్టపడి పెంచింది . ఇప్పుడు, ఆమె పిల్లలందరూ పెద్దవారు అయ్యారు. చిన్న కుమార్తె వివాహం మినహా అందరికీ వివాహాలు కూడా జరిగాయి. అందరూ ఎవరికి వారు స్వంత కుటుంబాలతో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే బేలి దేవి తన జీవితాంతం తనకు తోడుగా ఉండడం కోసం తన భర్త సోదరుడైన జగదీష్ (55) ను వివాహం చేసుకున్నారు.

ఒకే వేదికపై…

కుమార్తె ఇందూ (27) వివాహంతో పాటుగా, దేవి వివాహం కూడా జరిగింది. తర్వాత దేవి మాట్లాడుతూ… తన భర్త సోదరుడు ఒంటరి వాడని , 55 సంవత్సరాల వయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదని పేర్కొన్నారు. తన చిన్న కుమార్తె పెళ్లితో పాటు, తాను కూడా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. నా పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు . ఈ సమయంలో తాను కూడా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆశ పడుతున్నానని సంతోషంగా చెప్పారు. తమ కుటుంబం అంతా పెళ్ళికి ఓకే చెప్పిందన్నారు.