Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

2019 బ్యాడ్ మెమోరీస్: యువరాజ్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని దూరం..!

Cricket Highlights, 2019 బ్యాడ్ మెమోరీస్: యువరాజ్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని దూరం..!

2019వ సంవత్సరం టీమిండియాకు కాస్త చేదు.. కాస్త తీపి అందించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ ఎన్నో అపురూపమైన విజయాలు అందుకున్నా.. వరల్డ్‌కప్ చేజారడం క్రికెట్ అభిమానులకు నిరుత్సాహాన్ని మిగిలించింది. ఈ ఇయర్‌లో సంతోషాలు మాత్రమే కాదు వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సంవత్సరం ఆరంభంలో కాఫీ వివాదం పెద్ద సంచలనమైంది. అంతేకాక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవకపోవడం ధోని ఫ్యాన్స్‌కే కాదు.. క్రికెట్ అభిమానులకు కూడా నిరాశపరిచిన అంశం. మరి లేట్ ఎందుకు అలాంటి బాధాకరమైన ఘటనలు క్రికెట్‌లో ఏవేవి చోటు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం..

1.ఐపీఎల్ ఫైనల్( ముంబై వెర్సస్ చెన్నై):

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఎప్పటిలానే ఈ ఐపీఎల్‌లో కూడా మరోసారి తన సత్తా చాటింది. మహేంద్రసింగ్ ధోని సారధ్యంలో అత్యధికంగా సీనియర్ ఆటగాళ్లు ఉన్న ఈ ఫ్రాంచైజీ ప్రత్యర్థులను వణికించింది. ఆరంభ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఎదురులేని జట్టుగా ధోని సారథ్యంలో అద్భుత విజయాలు అందుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ గాయపడినప్పటికీ కూడా జట్టును విజయతీరాల వరకు చేర్చడానికి ఒంటరి పోరాటం చేసిన దృశ్యం ఇప్పటికీ ఫ్యాన్స్ కళ్ళల్లో మెదులుతోంది. ప్యాషన్‌కు నిదర్శనంగా అతడు ఆడిన తీరు అద్భుతం అని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

2. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్:

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అనూహ్య రీతిలో ఈ సంవత్సరం జూన్ 10న తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో భారత్ వరల్డ్‌కప్ గెలవడానికి కీలక పాత్ర పోషించిన యువరాజ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం సగటు అభిమానికి బాధ కలిగిందనే చెప్పాలి. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధితో పోరాడి జయించిన అతడు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అంతేకాకుండా రిటైర్మెంట్ సమయంలో టీమిండియాలో పాలిటిక్స్ జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేయడం అప్పట్లో పెద్ద దుమారానికి కూడా దారి తీసింది.

3.వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్(ఇండియా వెర్సస్ న్యూజిలాండ్):

ప్రపంచకప్‌లో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అనుకున్న రీతిలో భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఫామ్‌ చూసి అందరూ కూడా భారత్ కప్పు గెలవడం ఖాయమని భావించారు. అయితే ఈ సెమీఫైనల్‌ నాడు వర్షం రావడం.. ముందు రోజు న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయడం జరిగింది. తక్కువ స్కోర్‌‌కే కివీస్‌ను కట్టడి చేశారు. గెలిచేస్తారని కొండంత నమ్మకాన్ని భారత్ ఫ్యాన్స్ వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా రెండో రోజుకి పిచ్ పూర్తిగా మారిపోయింది. పది పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి భారత్ చేజేతులా మ్యాచ్‌ను జారవిడుచుకుంది. అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది.

4.ధోని రన్ ఔట్: వన్డే వరల్డ్ కప్:

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ టాప్ ఆర్డర్ విఫలమైన మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని.. చివరి వరకు క్రీజులో ఉన్నాడు. ఓవర్లు దగ్గర పడుతున్న కొద్దీ తనదైన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో ధోని జట్టును విజయతీరాల దగ్గరకు చేర్చే ప్రయత్నం చేశాడు. అయితే అనుకోని విధంగా 49 ఓవర్‌లో మార్టిన్ గప్తిల్ త్రో‌కి ధోని రనౌట్ కావడంతో టీమిండియా వన్డే వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించడమే కాకుండా.. ధోనిని ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో దూరం చేసింది.

5. వరల్డ్ కప్ ఫైనల్ త్రో: (బెన్ స్టోక్స్, గప్తిల్):

చేసుకున్న పాపాలకు.. తగిన ఫలితం అనుభవిస్తారంటే ఇదేనేమో.. ధోనిని రనౌట్ చేసి ఇండియా నిష్క్రమించేలా చేసిన గప్తిల్.. ఫైనల్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను  రనౌట్ చేసే క్రమంలో త్రో చేసి జట్టు ఓడిపోవడానికి కారకుడయ్యాడు. అంతేకాకుండా ఈ త్రోపై కూడా కొన్నాళ్ళు వివాదం చోటు చేసుకుంది. అయితే వీళ్ళందరిని పక్కన పెడితే.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓడిపోయినా కూడా ప్రెజెంటేషన్స్ దగ్గర చిరునవ్వు నవ్వడం అందరిని కట్టిపారేసింది. అంతేకాకుండా అతడే నిజమైన కెప్టెన్ అని క్రికెట్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు.

Related Tags