అంకెల గారడీ ఎవరిది..?

దేశం మొత్తం వెూదీ వెంట నడుస్తుందన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. అంకెల గారడీ ఎవరిదో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

అంకెల గారడీ ఎవరిది..?
Follow us

|

Updated on: May 19, 2020 | 5:34 PM

ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఒక బోగస్ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణ ప్రజలకు లబ్ధి జరగదా..? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియా ప్రధాని నరేంద్ర వెూదీని ప్రశంసిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం విమర్శిస్తున్నారని, సీఎం కేసీఆర్ భాష సరిగా లేదని మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

కేంద్రానిది నియంతృత్వ ధోరణి అని, ప్రజల నెత్తిన కత్తిపెట్టారంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లకు కిషన్ రెడ్డి బదులిచ్చారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ పరిధిని 3నుంచి 5 శాతానికి పెంచామని చెబుతూ.. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ సంస్కరణల్లో లోపాలు ఏమున్నాయో కేసీఆర్‌ చెప్పాలన్నారు. రాష్ట్రంలో 54 లక్షల జన్‌ధన్ ఖాతాల్లో కేంద్రం డబ్బులు వేయలేదా.. అని అడిగారు..అంకెల గారడీ ఎవరిదో కేసీఆర్ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్రాల వాటా అని గతంలో కేసీఆర్‌ మంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు చెప్పలేదని అన్నారు. వన్‌ నేషన్‌ వన్‌ గ్రిడ్‌ ద్వారా సంస్కరణలు చేపట్టాం. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల ఏ రంగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందో కేసీఆర్ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ చెప్పినట్లు పంటలు వేయకపోతే రైతుబంధు పథకం వర్తించదా? అన్ని ప్రశ్నించారు. దేశం మొత్తం వెూదీ వెంట నడుస్తుందన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలన్నారు.