మోదీ అంటే చైనీయులకు కూడా అభిమానమే!

భారత్‌ అంటే చాలు చైనా వాళ్లు ఒంటికాలి మీద లేస్తారన్నది మాత్రం అర్థసత్యమే! ఎందుకంటే భారత్‌ అంటే చైనా ప్రజలకు అభిమానమే! ఇక మన ప్రధాని నరేంద్రమోదీ అంటే మరింత అభిమానం! ఇది ఉత్తినే చెప్పడం లేదు.. చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ చెప్పిన అక్షర సత్యం..

మోదీ అంటే చైనీయులకు కూడా అభిమానమే!
Follow us

|

Updated on: Aug 27, 2020 | 2:18 PM

గుల్వాన్​ ఘటన తర్వాత భారత-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న మాట నిజమే! సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత ఉందన్న మాట కూడా నిజమే! భారత్‌ అంటే చాలు చైనా వాళ్లు ఒంటికాలి మీద లేస్తారన్నది మాత్రం అర్థసత్యమే! ఎందుకంటే భారత్‌ అంటే చైనా ప్రజలకు అభిమానమే! ఇక మన ప్రధాని నరేంద్రమోదీ అంటే మరింత అభిమానం! ఇది ఉత్తినే చెప్పడం లేదు.. చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ చెప్పిన అక్షర సత్యం.. మోదీని అభిమానించేవారు చైనాలోనూ ఎక్కువే ఉన్నారని చెప్పిందా పత్రిక. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసిందంటోంది.. ఆ మాటకొస్తే చైనాలో ఉండే నేతల కంటే అధిక శాతం ప్రజలు ప్రధాని మోదీనే ఇష్టపడుతున్నారట! నరేంద్రమోదీ చేస్తున్న పనులు, ఆయన విధి విధానాల పట్ల చైనీయుల్లో అధిక శాతం ప్రజలు ముచ్చటపడుతున్నారని సర్వేలో తేలిందని గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. చైనా పాలకులపై సగానికి సగం మంది అనుకూలంగా ఉంటే, మరో సగం మంది మోదీ సర్కారును మెచ్చుకుంటున్నారని పత్రిక పేర్కొంది. చైనా వ్యతిరేక భావన భారత్‌లో ఎక్కువగా ఉందని 70 శాతం మంది చైనీయులు అభిప్రాయపడుతున్నారట! రెండు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు చిగురించే రోజు ఎంతో దూరంలో లేదని 30 శాతం మంది గట్టిగా నమ్ముతున్నారని గ్లోబల్‌ టైమ్స్‌ అంటోంది..