100 మందికి పైగా ఖైదీలు జంప్

వంద మందికి పైగా ఖైదీలు జైలు నుంచి తప్పించుకు పారిపోయారు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. సుమత్రా ద్వీపంలోని ఇండోనేషియన్ జైలులో ఈ ఉదయం పలువురు ఖైదీలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. అది గమనించిన గార్డ్స్ పట్టుకుని వారిని చితకబాదారు. దీంతో అక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో జైలులో అగ్నిప్రమాదం సంభవించింది. ఇదే అదునుగా భావించిన ఖైదీలు జైలు నుంచి జంప్ అయ్యారు. ఈ అల్లర్లలో ముగ్గురు ఖైదీలు కత్తిపోట్లకు గురయ్యారు. ఓ పోలీస్‌పై కాల్పులు జరిగాయి. అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. పారిపోబోతున్న115 మంది ఖైదీలను తిరిగి పట్టుకున్నారు. మిగతా ఖైదీల ఆచూకీ కోసం పోలీసులు.. స్థానికులు, ఆర్మీ భద్రతా సిబ్బంది సహాయం తీసుకున్నారు. అయితే ఇండోనేషియాలో జైలు నుంచి పారిపోవడాలు చాలా సాధారణంగా జరుగుతుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *