లాక్‌డౌన్‌ 5.0పై రాష్ట్రాలదే తుది నిర్ణయం..?

రేపటితో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. ఈ నేపధ్యంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న 11 నగరాల్లో లాక్ డౌన్ 5.0ను అమలు చేస్తారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మరిన్ని సడలింపులను సైతం ప్రకటిస్తారని అంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో పరిమిత నిబంధనలు విధించడంతో పాటు ఢిల్లీ మెట్రోతో సహా మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ 5.0లో ఢిల్లీ, […]

లాక్‌డౌన్‌ 5.0పై రాష్ట్రాలదే తుది నిర్ణయం..?
Follow us

|

Updated on: May 30, 2020 | 8:24 AM

రేపటితో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. ఈ నేపధ్యంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న 11 నగరాల్లో లాక్ డౌన్ 5.0ను అమలు చేస్తారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మరిన్ని సడలింపులను సైతం ప్రకటిస్తారని అంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో పరిమిత నిబంధనలు విధించడంతో పాటు ఢిల్లీ మెట్రోతో సహా మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

లాక్ డౌన్ 5.0లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతా నగరాలపైనే కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అటు జన సాంద్రత ఎక్కువగా ఉండే థియేటర్లు, ప్రార్ధనా మందిరాలకు లాక్ డౌన్ 5.0లో అనుమతి లభిస్తుందా? లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఇప్పటికే లాక్ డౌన్ 4.0లో సెలూన్లకు అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా జిమ్స్ కూడా తెరుచుకునేందుకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది.

కంటైన్మెంట్ జోన్లు మినహా.. అన్ని ప్రాంతాల్లోనూ కోవిడ్ 19 నిబంధనలతో జిమ్స్‌కు అనుమతించే అవకాశం ఉందని సమాచారం. స్కూల్స్, విద్యాసంస్థలపై యధావిధిగా నిషేధం కొనసాగనుంది. కాగా, లాక్ డౌన్ 5.0లో రాష్ట్ర ప్రభుత్వాలే నిబంధనలు విధించేలా కేంద్రం ప్రతిపాదనలు సిద్దం చేస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా, కేంద్రం విధించే నిబంధనలను నీరుగార్చకుండా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలతో లాక్ డౌన్ పొడిగింపు అంశంపై హోంమంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడిన సంగతి విదితమే.

Also Read: ఏపీలో మరిన్ని లాక్‌డౌన్ సడలింపులు.. వాటికి కూడా అనుమతులు..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.