డోప్ టెస్ట్‌లో అనుమానాలు.. పృథ్వీ షాపై కావాలనే వేటు..?

డోప్ టెస్ట్‌లో విఫలమయ్యాడన్న ఆరోపణలతో యువ సంచలనం పృథ్వీ షాపై బీసీసీఐ ఎనిమిది నెలల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో షా వాడిన దగ్గు మందులో నిషిద్ధ ఉత్ప్రేరకం టెర్బుటాలిన్ ఉందంటూ అతడిపై తాత్కాలిక వేటు వేసింది భారత క్రికెట్ బోర్డు. ఆ తరువాత షా డోపింగ్ టెస్ట్ వివరాలను కూడా మీడియాకు విడుదల చేసింది. అయితే ట్రోఫీ సమయంలో షాతో పాటు […]

డోప్ టెస్ట్‌లో అనుమానాలు.. పృథ్వీ షాపై కావాలనే వేటు..?
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 12:57 PM

డోప్ టెస్ట్‌లో విఫలమయ్యాడన్న ఆరోపణలతో యువ సంచలనం పృథ్వీ షాపై బీసీసీఐ ఎనిమిది నెలల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో షా వాడిన దగ్గు మందులో నిషిద్ధ ఉత్ప్రేరకం టెర్బుటాలిన్ ఉందంటూ అతడిపై తాత్కాలిక వేటు వేసింది భారత క్రికెట్ బోర్డు. ఆ తరువాత షా డోపింగ్ టెస్ట్ వివరాలను కూడా మీడియాకు విడుదల చేసింది. అయితే ట్రోఫీ సమయంలో షాతో పాటు ఉన్న వారు ఈ టెస్ట్ ఫలితాలపై అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. ఆ సమయంలో పృథ్వీకి జలుబు, దగ్గుకు సంబంధించిన లక్షణాలేవీ లేవని ముంబయి టీమ్ కోచ్ వినాయక్ సమంత్, ఫిజియోథెర‌ఫిస్ట్ దీప్ తోమర్ పేర్కొన్నారు.

సమంత్, తోమర్ మాట్లాడుతూ.. ‘‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో షాకు తేలికపాటి జ్వరం ఉండేది. కానీ జలుబు, దగ్గుకు సంబంధించిన లక్షణాలు లేవు. తన ఆరోగ్యంపై అతడు మాకు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. అలాగే నివారణ కూడా అడగలేదు. ఆ సమయంలో మేం అతడి వెంటే ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని టీమ్ మేనేజర్ గణేష్ అయ్యర్ కూడా ధ్రువీకరించారు. షాకు కాస్త జలుబు ఉందని తాను గమనించానని, కానీ అది తగ్గేందుకు తమనేమి కోరలేదని అయ్యర్ తెలిపారు.

ఇక బీసీసీఐ చెప్పిన వివరాల ప్రకారం షా తన తండ్రి సలహాతో ఓ ఫార్మా సెంటర్‌కు వెళ్లి దగ్గు మందు తెచ్చుకున్నాడని, అందులో టెర్బుటాలిన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉందని, ఆ సమయంలో అతడు వేసుకున్న సిరప్ పేరు కూడా షా సరిగా చెప్పలేకపోయాడని పేర్కొన్నారు.

అయితే ఈ వివరాలపై అతడి సన్నిహితులతో పాటు పలువురు నెటిజన్లు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీ తన తండ్రితో ఎప్పుడూ అంత చనువుగా ఉండేవాడు కాదని సన్నిహితులు అంటున్నారు. తన తండ్రి కంటే, సంరక్షుడు, ముంబయి శివసేన ఎమ్మెల్యే సంజయ్ పోత్నీస్‌తోనే పృథ్వీ సాన్నిహిత్యంగా ఉండేవాడని వారు చెబుతున్నారు. ఇక ఆ సమయంలో ఇండోర్‌లో షా బస చేసిన హోటల్‌లో డాక్టర్ ఉండగా.. బయటికి వెళ్లి దగ్గు మందు తీసుకోవాల్సిన అవసరం ఏంటని..? వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఒక శిక్షణ పొందిన క్రికెటర్‌కు తాను ఎలాంటి మందులు తీసుకోవాలన్న విషయంపై కనీస అవగాహన లేకుండా ఎలా ఉంటుంది..? అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రశ్నలన్నింటికి బీసీసీఐ ఎలాంటి సమాధానం ఇస్తుందో, మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.