అసోంలో వరద బీభత్సం..పొంగిపొర్లుతున్న నదులు

అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు రాష్ట్రంలో వరదలు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బ్రహ్మపుత్ర నది పొంగి..

అసోంలో వరద బీభత్సం..పొంగిపొర్లుతున్న నదులు
Follow us

|

Updated on: Jul 14, 2020 | 10:04 PM

అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు రాష్ట్రంలో వరదలు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బ్రహ్మపుత్ర నది పొంగిపొర్లుతోంది. ఈ వరద ధాటికి అక్కడ 76 మంది మరణించారు. జాతీయ విపత్తు నిర్వ‌హ‌ణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వ‌హ‌ణ‌ దళ సిబ్బంది, స్థానిక పరిపాలన అధికారుల‌తో కలిసి బాధిత ప్రజలను రక్షించడానికి, వారికి సహాయక సామగ్రి అంద‌జేయ‌డానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, జిల్లా యంత్రాంగాలు గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 19,548 మందిని రక్షించారు. మరిన్ని సహాక చర్యలు కొనసాగుతున్నాయి.

బ్రహ్మపుత్ర వరదల వల్ల పొంగి ప్రవహిస్తున్న నదుల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఏడు ప్రాంతాల్లో నధులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 20 జిల్లాలో ఏర్పాటు చేసిన 480 పునరావాస కేంద్రాల్లో 60,696 మంది ఆశ్రయం పొందుతున్నారు. చాలా ప్రాంతాలు నీట మునగడంతో లక్షలాది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.