బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు- మంత్రి మోపిదేవి

రాజ్యసభలో గుంటూరు జిల్లాకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. ముందు నుంచి గుంటూరు జిల్లాకు రాజకీయంగా ఓ ప్రాధాన్యత ఉందని.. జిల్లా అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని అన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న కార్యకర్తల కష్టమే ముఖ్యమని… కార్యకర్తల కష్టాన్ని అమ్ముకున్న ఏ పార్టీ మనుగడ సాధించదన్నారు. జాతీయ స్దాయిలో ఏ పార్టీలోను పార్టీ […]

బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు- మంత్రి మోపిదేవి
Follow us

|

Updated on: Jun 22, 2020 | 2:24 PM

రాజ్యసభలో గుంటూరు జిల్లాకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. ముందు నుంచి గుంటూరు జిల్లాకు రాజకీయంగా ఓ ప్రాధాన్యత ఉందని.. జిల్లా అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని అన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న కార్యకర్తల కష్టమే ముఖ్యమని… కార్యకర్తల కష్టాన్ని అమ్ముకున్న ఏ పార్టీ మనుగడ సాధించదన్నారు.

జాతీయ స్దాయిలో ఏ పార్టీలోను పార్టీ కోసం పని చేస్తున్న వారికి సరైన ప్రాధాన్యత లభించడం లేదన్నారు. కులాన్ని తెరపైకి తెచ్చి .. అవసరాలకు వాడుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని విమర్శించారు. అన్ని నామినేటెడ్ పోస్టులలో 50 శాతం రిజర్వేషన్ కులాలకు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని మంత్రి గుర్తు చేశారు.