కేంద్రం తీపికబురు.. ఆ స్కీంలో చేరితే ఇక డబుల్ పెన్షన్!

అటల్ పెన్షన్ యోజన (ఎపివై) కింద నెలవారీ పెన్షన్ పరిమితిని పెంచాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పిఎఫ్‌ఆర్‌డిఎ సూచించింది. పెన్షన్ పథకంలో చేరడానికి వయోపరిమితిని 40 నుండి 60 సంవత్సరాలకు పెంచాలని చూస్తోంది. అటల్ పెన్షన్ యోజన అనేది ప్రభుత్వ పెన్షన్ పథకం. ఇది అసంఘటిత రంగ ఉద్యోగులకు స్వయం ఉపాధి పథకం. ఈ పథకంలో చేరటానికి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు అర్హులు. “అటల్ పెన్షన్ యోజన (ఎపివై) వయోపరిమితిని 40 […]

కేంద్రం తీపికబురు.. ఆ స్కీంలో చేరితే ఇక డబుల్ పెన్షన్!
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 8:26 PM

అటల్ పెన్షన్ యోజన (ఎపివై) కింద నెలవారీ పెన్షన్ పరిమితిని పెంచాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పిఎఫ్‌ఆర్‌డిఎ సూచించింది. పెన్షన్ పథకంలో చేరడానికి వయోపరిమితిని 40 నుండి 60 సంవత్సరాలకు పెంచాలని చూస్తోంది. అటల్ పెన్షన్ యోజన అనేది ప్రభుత్వ పెన్షన్ పథకం. ఇది అసంఘటిత రంగ ఉద్యోగులకు స్వయం ఉపాధి పథకం. ఈ పథకంలో చేరటానికి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు అర్హులు.

“అటల్ పెన్షన్ యోజన (ఎపివై) వయోపరిమితిని 40 నుండి 60 సంవత్సరాలకు పెంచాలని మేము కోరుతున్నాము. అలాగే పెన్షన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న ₹ 5,000 నుండి నెలకు ₹ 10,000 కు పెంచాలని” పిఎఫ్‌ఆర్‌డిఎ సభ్యుడు సుప్రతీం బందోపాధ్యాయ్ తెలిపారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) ను నిర్వహించే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఆర్‌డిఎ) కూడా అటల్ పెన్షన్ యోజనను నియంత్రిస్తుంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సిసిడి (1 బి) కింద టైర్ I ఎన్‌పిఎస్ ఖాతాలో పెట్టుబడులు పెట్టడానికి ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని లక్షకు పెంచాలని పిఎఫ్‌ఆర్‌డిఎ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్‌పిఎస్ పరిధిలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పన్ను రహిత సహకారం అందించే సదుపాయాన్ని అన్ని వర్గాల చందాదారులకు విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరింది.