ఆలస్యంగా తాకనున్న రుతుపవనాలు..

నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. నార్మల్‌గా అయితే జూన్ ఒకటిన కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకేవని.. ఈ సారి ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో వరుణుడి కోసం కొండంత ఆశతో అన్నదాత ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్ 6న కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ. జూన్ 11న ఏపీని రుతుపవనాలు తాకవచ్చని అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే నాలుగు రోజులు ఆలస్యంగా వస్తున్నాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది.

కాగా.. ఇప్పటికే సూర్యుడు అందరినీ హడలెత్తిస్తున్నాడు. 48 డిగ్రీల ఎండతో ఎవరినీ బయటకు రాకుండా చేస్తున్నాడు. అలాగే.. వర్షాలు త్వరగా కురవాలని ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ, కంచికామ కోఠి సంయుక్తంగా వరుణయాగాన్ని ప్రారంభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *