నైరుతి ఆగమనం.. ఆనందంలో రైతులు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచికొట్టింది. ఎప్పుడెప్పుడా అని ఊరించిన నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలనూ రుతుపవనాలు తాకాయి. నైరుతి రాకతో ఏపీ, తెలంగాణలలో తొలకరి పలకరింపుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం.. భానుడి ప్రతాపానికి భగ్గుమన్న తెలుగు నేల కాస్త చల్లబడింది. తొలకరి జల్లుతో మట్టి పరిమళాలు వెదజల్లాయి. ప్రతియేటా జూన్ నెల ప్రారంభంలోనే వర్షాలు పడేవి. అయితే.. ఈ సారి కాస్త ఆలస్యంగా వచ్చాయి. రైతులు ఇప్పటికే చదును […]

నైరుతి ఆగమనం.. ఆనందంలో రైతులు..
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 10:29 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచికొట్టింది. ఎప్పుడెప్పుడా అని ఊరించిన నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలనూ రుతుపవనాలు తాకాయి. నైరుతి రాకతో ఏపీ, తెలంగాణలలో తొలకరి పలకరింపుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం.. భానుడి ప్రతాపానికి భగ్గుమన్న తెలుగు నేల కాస్త చల్లబడింది. తొలకరి జల్లుతో మట్టి పరిమళాలు వెదజల్లాయి.

ప్రతియేటా జూన్ నెల ప్రారంభంలోనే వర్షాలు పడేవి. అయితే.. ఈ సారి కాస్త ఆలస్యంగా వచ్చాయి. రైతులు ఇప్పటికే చదును చేసి ఉంచుకున్న భూములు తడిసాయి. దీంతో.. రైతులు వ్యవసాయ పనులకు రెడీ అవుతున్నారు.

కాగా.. భానుడు ఉక్కపోతతో అల్లాడిన నగర వాసులు రాత్రి కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, కూకట్‌పల్లి పాతబస్తీ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసింది.