మాన్‌సూన్ ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా వర్షాలు

మొన్నటివరకు ఎండలతో అల్లాడిన తమిళనాడు ఇన్నాళ్లకు వర్షాన్ని చవిచూసింది. గత 24 గంటల్లో తమిళనాడులోని వల్పరైలో 137 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్నటివరకు వాగులు, వరదలతో పొంగిన కేరళ కాస్త గ్యాప్ తీసుకుంది. ఇక పంజాబ్‌లోనూ సైక్లోనిక్ సర్క్యూలేషన్ కొనసాగుతోంది. ఈ ప్రభావంతో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో మంచివర్షాలు పడుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో పొలిటికల్ హీట్ ఉన్నా.. అక్కడ కూడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. కాని పంజాబ్‌లో ఏర్పడిన సైక్లోనిక్ సర్క్యూలేషన్ ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మోస్తరు […]

మాన్‌సూన్ ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా వర్షాలు
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 3:25 PM

మొన్నటివరకు ఎండలతో అల్లాడిన తమిళనాడు ఇన్నాళ్లకు వర్షాన్ని చవిచూసింది. గత 24 గంటల్లో తమిళనాడులోని వల్పరైలో 137 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్నటివరకు వాగులు, వరదలతో పొంగిన కేరళ కాస్త గ్యాప్ తీసుకుంది. ఇక పంజాబ్‌లోనూ సైక్లోనిక్ సర్క్యూలేషన్ కొనసాగుతోంది. ఈ ప్రభావంతో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో మంచివర్షాలు పడుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో పొలిటికల్ హీట్ ఉన్నా.. అక్కడ కూడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. కాని పంజాబ్‌లో ఏర్పడిన సైక్లోనిక్ సర్క్యూలేషన్ ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మోస్తరు నుంచి ఒకటిరెండు చోట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, తెలంగాణలో మోస్తారు నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 54.8, కరీంనగర్‌లో 54 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. కృష్ణాలో 65 మిల్లీమీటర్లు, ఈస్ట్ గోదావరి 56.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి.