భారీ వర్షాలు కురిసే అవకాశం.. కేరళలో ఆరంజ్ అలర్ట్

అరేబియా సముద్రం మీదుగా వస్తోన్న రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళను తాకనున్నాయి. దీంతో రానున్న 24గంటల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేరళలోని పలు జిల్లాలకు ఆ రాష్ట్ర ప్రకృతి విపత్తుల శాఖ ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. కొల్లామ్, అలప్పుళ, ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల్లో ఈ నెల 9, 10న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని […]

భారీ వర్షాలు కురిసే అవకాశం.. కేరళలో ఆరంజ్ అలర్ట్
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 5:23 PM

అరేబియా సముద్రం మీదుగా వస్తోన్న రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళను తాకనున్నాయి. దీంతో రానున్న 24గంటల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేరళలోని పలు జిల్లాలకు ఆ రాష్ట్ర ప్రకృతి విపత్తుల శాఖ ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. కొల్లామ్, అలప్పుళ, ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల్లో ఈ నెల 9, 10న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ పేర్కొంది. వీటితో పాటు మరో 7 జిల్లాలకూ.. ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. కాగా సాధారణంగా వాతావరణం సరిగా లేనప్పుడు ఆరంజ్ అలర్ట్‌ను, వాతావరణం మరింత క్షీణించినప్పుడు ఎల్లో అలర్ట్‌ను అధికారులు ప్రకటిస్తుంటారు. ఇదిలా ఉంటే ఈ రుతుపవనాల వలన కేరళతో పాటు కర్ణాటక, లక్ష్యద్వీప్‌లలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.