నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం!

రెండు తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీనితో వానల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ తీవ్ర నిరాశే అని చెప్పాలి. అరేబియా సముద్రంలోని వాయు తుఫాన్ వల్లనే రుతుపవనాల కదిలికలు కొద్దిరోజులుగా నిలిచిపోయాయని వాతావరణ శాఖ వెల్లడించింది . ప్రస్తుతం కేరళ దాటి కర్ణాటక దక్షిణ ప్రాంతంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఆదివారం నాటికి కర్ణాటకలో మరింత వ్యాపించే అవకాశం ఉందని వారు ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 19, లేదా […]

నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం!
Follow us

|

Updated on: Jun 15, 2019 | 10:56 AM

రెండు తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీనితో వానల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ తీవ్ర నిరాశే అని చెప్పాలి. అరేబియా సముద్రంలోని వాయు తుఫాన్ వల్లనే రుతుపవనాల కదిలికలు కొద్దిరోజులుగా నిలిచిపోయాయని వాతావరణ శాఖ వెల్లడించింది . ప్రస్తుతం కేరళ దాటి కర్ణాటక దక్షిణ ప్రాంతంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఆదివారం నాటికి కర్ణాటకలో మరింత వ్యాపించే అవకాశం ఉందని వారు ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 19, లేదా 20 తేదీల్లో వచ్చే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.