హ్యాట్సాఫ్ టు.. ఇండియన్ ఆర్మీ.. వీడియో

Jammu & Kashmir : Two persons rescued after getting stuck in Tawi river, హ్యాట్సాఫ్ టు.. ఇండియన్ ఆర్మీ.. వీడియో

ఉత్తర భారతంలో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ వరదల్లో చిక్కుకున్న వారిని భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షిస్తోంది. అయితే ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని థావీ నది వరదల్లో చిక్కుకున్న ఓ ఇద్దర్ని భారత సైన్యం రక్షించింది. జ‌మ్మూలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్ వ‌ద్ద ఆక‌స్మికంగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. అయితే అక్క‌డ ప‌నిచేస్తున్న ఇద్ద‌రు కార్మికులు ఆ వ‌ర‌ద ప్ర‌వాహంలో చిక్కుకున్నారు. దీంతో ఆ ఇద్ద‌రూ బ్రిడ్జ్‌పైనే కూర్చుండిపోయారు. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో.. ఎటు క‌ద‌లలేక‌పోయారు. అయితే వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఆర్మీ హెలికాప్ట‌ర్ ద్వారా ఓ జ‌వాను బ్రిడ్జ్ క‌ట్ట‌పై దిగి దానిపై ఉన్న ఇద్ద‌ర్నీ ర‌క్షించాడు. ఇద్ద‌ర్నీ తాడు సాయంతో పైకిలాగారు. ఈ ఆప‌రేష‌న్‌ను అనేక టీవీ ఛాన‌ళ్లు లైవ్‌లో ప్ర‌సారం చేశాయి. ఆర్మీ చూపిన తెగువ‌ను మెచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *