అర్ధరాత్రి తడిసిముద్దయిన నగరం

హైదరాబాద్‌లో అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్టా, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు నగర శివార్లలో కూడా భారీగా వర్షం పడింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో రవాణాకు […]

అర్ధరాత్రి తడిసిముద్దయిన  నగరం
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2019 | 8:39 AM

హైదరాబాద్‌లో అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్టా, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు నగర శివార్లలో కూడా భారీగా వర్షం పడింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.