‘వాయు’ తుఫానుపై అప్రమత్తం: రాష్ట్రాలకు మోదీ ఆదేశం

అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన వాయు తుఫాను బలపడింది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర, కొంకణ్, గోవా, కేరళ, లక్షద్వీప్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రదేశాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వగా.. పలు చోట్ల చెట్లు, స్తంబాలు నేలకొరిగాయి. మరో రెండు రోజులు ఈ తుఫాను ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వాయు పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయా ప్రభుత్వాలు […]

‘వాయు’ తుఫానుపై అప్రమత్తం: రాష్ట్రాలకు మోదీ ఆదేశం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 22, 2019 | 7:20 PM

అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన వాయు తుఫాను బలపడింది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర, కొంకణ్, గోవా, కేరళ, లక్షద్వీప్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రదేశాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వగా.. పలు చోట్ల చెట్లు, స్తంబాలు నేలకొరిగాయి. మరో రెండు రోజులు ఈ తుఫాను ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వాయు పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

‘‘వాయు తుఫాను మీద పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వాయు తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లోని అధికారులతో నేను మాట్లాడుతూ.. వివరాలు తెలుసుకుంటున్నా. ఎన్డీఆర్ఎఫ్‌తో పాటు మిగిలిన బృందాలు సహాయక చర్యలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అంటూ మోదీ పేర్కొన్నారు.