Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

Tirumala : గుడ్ న్యూస్..తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు…!

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు టిటిడి కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లేందుకు మోనో రైలును అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. స్వామివారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.
Tirumala : Light rail transit suggested for Tirumala, Tirumala : గుడ్ న్యూస్..తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు…!

Tirumala :  తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు టిటిడి కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లేందుకు మోనో రైలును అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. స్వామివారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని..తిరుమలలో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి టిటిడి పూనుకుంది. దీనిపై ఇప్పటికే టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో భేటీ అయ్యి..చర్చలు జరిపారు. తిరుపతి నుంచి తిరుపతికి మోనో రైలు,  లైట్ మెట్రోలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.  ఏడుకొండల్లో ఎలాంటి టన్నెల్ తవ్వకుండా ఉన్న మార్గాల్లోనే మోనో రైలు అవకాశాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీని కోరినట్టు స్పష్టం చేశారు. ఆస్ట్రియాలో ఎత్తైన కొండపైకి మోనో రైలు మార్గం ఉందని..దాన్ని ప్రాతిపదికగా తీసుకుని తిరుమలకు రైలు సౌకర్యాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

Related Tags